
సాక్షి, న్యూఢిల్లీ : మన సైనిక బలగాలు అవసరమైతే మరో కార్గిల్ యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాయని భారత వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా అన్నారు. చివరి యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని, మరోసారి కార్గిల్ యుద్ధం వస్తే దీటుగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
కార్గిల్ యుద్ధం జరిగి 20 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా మాట్లాడారు. ఎలాంటి వాతావరణంలోనైనా శత్రు దేశంపై బాంబులతో విరుచుకుపడగల సామర్ధ్యం వైమానిక దళం సొంతమని చెప్పారు. గురితప్పకుండా లక్ష్యాన్ని ఢీ కొట్టగలిగే మన సామర్ధ్యం బాలాకోట్ వైమానిక దాడుల్లో మనం చూశామని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment