ఎట్టకేలకు భారత్కు క్షమాపణలు | Pak born actor says sorry for anti India tweets | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు భారత్కు క్షమాపణలు

Published Tue, Sep 27 2016 8:26 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

ఎట్టకేలకు భారత్కు క్షమాపణలు - Sakshi

ఎట్టకేలకు భారత్కు క్షమాపణలు

లండన్: భారత్ ను రెచ్చగొట్టేలా ట్వీట్లు చేసిన పాకిస్థాన్ సంతతికి చెందిన లండన్ వాసి, టీవీ నటుడు మార్క్ అన్వర్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన ట్వీట్లతో ఎవరూ అంగీకరించకపోగా.. భారతీయలు మనసులు గాయపడిన నేపథ్యంలో తాను ప్రతి మాటను వెనక్కి తీసుకుంటానని ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెబుతూ యూట్యూబ్ లో పెట్టాడు. భారత జాతిని కించపరిచేలా అన్వర్ అసభ్య పదజాలంతో జమ్ముకశ్మీర్ ఆందోళనలు ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై లండన్ లో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు.

ఒక జాతిని కించపరిచేవిధంగా మాట్లాడిన అన్వర్ పై కేసు నమోదుకు ఫిర్యాదు అందిందని పోలీసులు కూడా చెప్పారు. దీంతో తాము దర్యాప్తును ప్రారంభించామని చెప్పారు. ఒకరిని కించపరిచేలా చేసే చర్యలు తమ వద్ద ఏమాత్రం అంగీకరించబోమని వారు చెప్పారు. మరోపక్క, తాను చేసిన వ్యాఖ్యలపట్ల క్షమాపణలు చెబుతూనే కశ్మీర్ ప్రజలపట్ల నా మనసులో భావాలు మాత్రం వాస్తవమైనవని అన్నాడు.

అయితే, తాను చేసిన పొరపాటును ప్రతిఒక్కరు పెద్ద మనసుతో క్షమిస్తారని భావిస్తున్నానంటూ వెల్లడించాడు. కశ్మీర్లో కొన్ని ఫొటోలు, వీడియోలు చూసి ఆవేశంతో తాను అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో భారతీయులను తిడుతూ అన్వర్ తొలుత అసభ్య పదజాలం వాడుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement