ఎఫ్ఐఆర్ లో కేంద్ర మంత్రి పేరు
ఆగ్రా: వీహెచ్‌పీ నేత హత్య నేపథ్యంలో ఆగ్రాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేత, కార్పొరేటర్ కుందనిక శర్మ, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల హత్యకు గురైన వీహెచ్‌పీ నేత అరుణ్ సంస్మరణసభలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి రాంశంకర్ కఠేరియా, భాజపా ఎంపీ బాబూలాల్, సాధ్వి ప్రాచి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎఫ్ఐఆర్ లో వీరు పేర్లు కూడా ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యే పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టు తెలిపాయి. అయితే కేంద్రమంత్రి పేరు ఎఫ్ఐఆర్ లో లేదని అంతకుముందు వార్తలు వచ్చాయి. తాను విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని చేయలేదని కఠేరియా పేర్కొన్నారు.