న్యూఢిల్లీ: దేశంలో విభజనవాద శక్తులను కట్టడి చేయాలని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)బెంగళూరు, అహ్మదాబాద్‌లకు చెందిన విద్యార్థులు, బోధనాసిబ్బంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధాని మౌనం దాల్చడం విద్వేషాలను రెచ్చగొట్టే వారికి ధైర్యాన్నిస్తోందని పేర్కొన్నారు. దేశంలో మైనారిటీలపై దాడుల ఘటనలు, విద్వేష పూరిత ప్రసంగాల నేపథ్యంలో రాసిన ఈ లేఖపై 180 మందికి పైగా సంతకాలు చేశారు. ‘మిశ్రమ సంస్కృతులకు గౌరవించే మీరు.. దేశంలో పెరుగుతున్న అసహనంపై మౌనంగా ఉండటం మమ్మల్ని బాధిస్తోంది. మీ మౌనం విద్వేషపూరిత గొంతుకలకు బలాన్నిస్తోంది’ అని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment