
శంభాజీనగర్:కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత రాజకీయాలన్నీ పవర్ పాలిటిక్సేనని తేల్చేశారు.రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఛత్రపతి శంభాజీనగర్‌లో శుక్రవారం(సెప్టెంబర్27) జరిగిన రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిసన్‌రావ్ బగాడే సన్మాన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు.ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా పనిచేసిన సమయంలో ఎన్నో సమస్యలొచ్చాయన్నారు. పార్టీ కార్యకర్తగా 20 ఏళ్లు విదర్భలో పనిచేసినట్లు చెప్పారు.
ఆ రోజుల్లో తాము నిర్వహించే ర్యాలీలపై ప్రజలు రాళ్లు వేసేవారని గడ్కరీ గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాతి రోజుల్లో తాను ప్రసంగాలు చేయడానికి వాడే ఆటోను కొందరు తగలబెట్టారని చెప్పారు. ఇప్పుడు తనకు వచ్చిన గుర్తింపు తనది కాదని, హరిభౌకిసన్‌రావ్ బగాడే లాంటి వాళ్ల కారణంగా వచ్చిందేనన్నారు. కాగా, తనకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చిందని ఇటీవలే గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.