
టాటా గ్రూపుకి ఊహించిన విధంగా ఎదురు దెబ్బ తగిలింది, సుమారు డెబ్బై ఏళ్ల తర్వాత సొంతం చేసుకున్న ఎయిండియాను గాడిన పెట్టే క్రమంలో తీసుకున్న తొలి పెద్ద నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. రాజకీయ ఎత్తుడగల కారణంగా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఎయిండియాను ఇటీవల సొంతం చేసుకుంది టాటా గ్రూపు. ఎయిరిండియాను తిరిగి గాడిన పెట్టేందుకు టర్కీష్ ఎయిర్‌లైన్స్‌కి సీఈవోగా పని చేస్తున్న టర్కీ జాతీయుడు ఇల్కర్ ఆయ్‌సీని సీఈవోగా నియమించాలని నిర్ణయించింది. 2014లో టర్కీష్ ఎయిర్‌లైన్స్‌లో చేరిన ఆయ్‌సీ 2022 జనవరి 31 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఏప్రిల్ 1 నుంచి ఎయిరిండియా సీఈవోగా పదవీ బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది.
ఎయిరిండియా లాంటి సంస్థకు విదేశీ వ్యక్తిని సీఈవోగా నియమించడంపై ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన సద్వేశీ జాగరణ్ మంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నియమకాన్ని తప్పు పడుతూ విమర్శలు ఎక్కుపెట్టింది. దీంతో ఒక్కసారిగా టాటా సీఈవో నియామకం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో కంగుతున్న ఇల్కర్ ఆయ్‌సీ టాటా సీఈవో పదవిని చేపట్టేందుకు విముఖత చూపుతున్నట్టు ప్రకటించారు.
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌కి సన్నిహితుడిగా పేరుంది. మరోవైపు మన కంపెనీలకు విదేశీ వ్యక్తులను సీఈవోగా నియమించే ముందు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేసన్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఐయ్‌సీని నియమించబోతున్న వార్తలు వెలువడగానే రాజకీయ దుమారం రేగడంతో మిగిలిన ప్రక్రియ ముందుకు సాగలేదు. కాగా ఈ అంశంపై టాటాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment