జడ్చర్ల సమీపంలో మంగళవారం ఉదయం జాతీయ రహదారి-44 పై రోడ్డు ప్రమాదం జరిగింది.
మహబూబ్‌నగర్: జడ్చర్ల సమీపంలో మంగళవారం ఉదయం జాతీయ రహదారి-44 పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయినట్టు తెలుస్తోంది.
భక్తులు ప్రయాణిస్తున్న బస్సు పుష్కర స్నానానికి వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.