
మా నాన్న పేరు నిలబెడతాం..
రాజమండ్రి : సినీ పరిశ్రమలో తండ్రి ఈవీవీ సత్యనారాయణ సముపార్జించిన పేరును నిలబెట్టేలా తాను, సోదరుడు నరేష్ కృషిచేస్తామని హీరో, నిర్మాత ఆర్యన్ రాజేష్ తెలిపారు. శనివారం ఆయన భార్య సుభాషిణి, తల్లి సరస్వతితో కలిసి వి.ఐ.పి. ఘాట్‌లో పుష్కరస్నానం ఆచరించి తండ్రి ఈవీవీ సత్యనారాయణకి పిండప్రదానం చేశారు.
అనంతరం విలేకరులతో అర్యన్ రాజేష్ మట్లాడారు. ఇటీవలే వివాహమైన తన సోదరుడు నరేష్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని తెలిపారు. జులై 21న నరేష్ హైదరాబాద్ వస్తాడని చెప్పారు. నరేష్ అవకాశాన్ని బట్టి పుష్కరస్నానం చేస్తాడని అర్యన్ రాజేష్ పేర్కొన్నారు.