మాతా... నమస్తుతే | In godavari pushkarni holy bath of devotees continues | Sakshi
Sakshi News home page

మాతా... నమస్తుతే

Published Thu, Jul 16 2015 3:25 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

మాతా... నమస్తుతే

మాతా... నమస్తుతే

పుష్కర సంరంభం వైభవంగా కొనసాగుతోంది. గోదారమ్మ తీరం భక్తజన సందడితో పులకించి పోతోంది. వివిధ పుష్కర క్షేత్రాలలో బుధవారం వేలాది మంది పవిత్ర స్నానాలను ఆచరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
రెండవ రోజు 92,448
- గోదారమ్మ చెంత భక్తుల పరవశం
- రెండో రోజూ పుష్కర స్నానాలు
- పోచంపాడ్‌లో మంత్రి ఐకేరెడ్డి పూజలు
- మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న కూడా
- పిండ ప్రదానం చేసిన ఎంపీ కేశవరావు
- తుంగినిలో ఇన్‌చార్జి డీఐజీ గంగాధర్ దంపతుల పవిత్రస్నానం
- సౌకర్యాలను  పర్యవేక్షించిన కలెక్టర్
- కందకుర్తిలో నీరులేక ఇబ్బందులు
- పోచంపాడ్‌లో పెరుగుతున్న రద్దీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:
గోదావరి పుష్కరాల సందర్భంగా రెం డోరోజు బుధవారం కూడా పవిత్రస్నానాల కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతిని ధులు, అధికారులు ఘాట్లను సందర్శించారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పో చంపాడ్‌లో పుష్కరస్నానాలు చేశారు. ఎంపీ కె. కేశవరావు పుష్కరస్నానంతో పాటు పిండప్రధానం చేశారు.

నిజామాబాద్ రేంజ్ ఇన్‌చార్జ్ డీఐజీ ఎడ్ల గంగాధర్ తుంగినిలో కుటుంబసభ్యులతో పుష్కరస్నానం చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, భక్తుల తాకిడి నేపథ్యంలో కలెక్టర్ రొ నాల్డ్‌రోస్ పోచంపాడ్, కందకుర్తి, తడపాకల్, గుమ్మిర్యాల్ తదితర పుష్కరఘాట్లలో సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సుడిగాలి పర్యటన చేశారు. పోచంపాడ్, తడపాకల్‌లో కలెక్టర్, కందకుర్తిలో జేసీ ఎ.రవీందర్‌రెడ్డిలు పుష్కరస్నానం, పూజలు చేశారు. ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి పుష్కరఘాట్లను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించా రు. రెండోరోజూ కూడ హైదరాబా ద్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్,మహారాష్ట్ర,కర్ణాటకల నుం చి భక్తులు పెద్ద సంఖ్యలో జిల్లాకు చేరుకుని పుష్కరస్నానాలు చేశారు.
 
కందకుర్తిలో తప్పని నీటి ఇబ్బందులు
త్రివేణి సంగమ వేదిక కందకుర్తిలో భక్తులు నీటి సమస్యను ఎదుర్కున్నారు. భక్తుల సందడితో కందకుర్తి పులకరించింది కానీ, కరుణించని వరుణుడు, ప్రవహించని గోదారమ్మ చెంత జల్లుల స్నానాలు తప్పలేదు. మంగళవారం ‘తలపై చల్లుకునే మాత్రం నీళ్లున్నా ఫరవాలేదు’ అంటూ భక్తులు సెంటిమెంట్ కోసం కందకుర్తికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ ఒక్కరోజే 65 వేల మందికి భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. అయితే,బుధవారం భక్తులు వచ్చినా కందకుర్తి వద్ద గోదావరి లో పూర్తిగా నీరు లేకపోవడం, మురికిగా మారిన నీటిలో స్నానం చేయలేక ఇబ్బంది పడ్డారు. చేసేది లేక జల్లు స్నానం (షవర్‌బాత్) కేంద్రాల వద్దనే పుష్కరస్నానాలు చేశారు.

భక్తుల ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న చాలామంది కందకుర్తికి ప్రత్యామ్నాయంగా పోచంపాడ్, తడపాకల్, ఉమ్మెడ, తుంగిని తదితర పుష్కరఘాట్లను ఎంచుకున్నారు. దీంతో కందకుర్తికి భక్తుల రద్దీ తగ్గగా.. పోచంపాడ్‌కు తాకిడి పెరిగింది. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, దేవాదాయశాఖ కమీషనర్ కేశవ్ తదితరులు పోచంపాడ్‌లోనే పుష్కరస్నానాలు చేశారు. హైదరాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన చా లా మంది భక్తులు కూడ పోచంపాడ్ దారి పట్టడంతో అక్కడ రద్దీ పెరిగింది. శుక్రవారం, శనివారం, ఆదివారాలలో మరింత భక్తులు పెరిగే అవకాశం ఉందని, ఈ దిశ లో ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
 
పుష్కరఘాట్లలో సమస్యల నివేదన
సుమారు 50 లక్షల మంది భక్తుల కోసం జిల్లాలోని 11 ప్రాంతాలలోని 18 ఘాట్లలో  ఏర్పాట్లు చేశారు. ఆ మేరకు భక్తులు లేకపోగా, శుక్రవారం నుంచి భక్తుల రద్దీ పె రుగుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా అధికార యంత్రాంగం కందకుర్తిపై దృష్టి సారించి అక్కడ భారీ ఏర్పాట్లు చేసింది. అయితే మహారాష్ర్టలోని గైక్వాడ్, విష్ణుపు రి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు అక్కడి ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. దీనికి తోడు వర్షాలు, వరదలు లేక గోదారి బోయిబోయింది.దీంతో కందకుర్తికి చేరు కున్న భక్తులు నీటి వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. పొక్లయినర్లతో గోదావరిలో ఉన్న నీరంతా ఒకేచోటకు చేర్చే ప్రయత్నం చేసినా భక్తుల రద్దీకి అది సరిపోలేదు. పోచంపాడ్, దాని కింది భాగంలోని ఘాట్లకు ప్రాజెక్టు నీటిని వదులుతున్నందున ప్రజలు అక్కడికి వెళ్లాలని కలెక్టర్ రోస్ భక్తులకు విజ్ఞప్తి చేశారు.

ఐదు పుష్కర ప్రాంతా లను పర్యటించి వివరాలను, ఏర్పాట్లను పరిశీలించి, ఘాట్ల వద్ద నీటి ప్రవాహం వచ్చేలా, మురికి నీరు నిలువ ఉండకుండా చూడాలని,తద్వారా భక్తులు శుభ్రమైన నీటి స్నానాలు ఆచరించడానికి వీలు కలుగుతుందని సూచించారు. ఘాట్ల ప్రక్కన గల మట్టిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. పోచంపాడ్ ఘాట్ల వద్ద నిలిచి ఉన్న వాహనాలను చూసి వెంటనే వాటిని పార్కింగ్ స్థలానికి తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఘాట్ల వద్ద వాహనాలు నిలుపడానికి వీలు లేదని అధికారులను ఆదేశించారు. విఐపీలు, ఎస్కారు వాహనాలు మినహా ఏవీ ఉండడానికి వీలు లేదని, వికలాంగులు, వద్దులను ఘాట్ల వద్ద వదిలి వాహనాలు వెనకకు వెళ్లాల్సిందేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement