‘వా’ నరుల పుష్కర స్నానం
నిర్మల్ అర్బన్ : గోదావరి పుష్కరాలకు నరులతోపాటు వానరాలు కూడా పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలంలోని మాదాపూర్ పుష్కర ఘాట్ వద్ద పెద్ద సంఖ్యలో కోతులు వచ్చి గోదావరి తీరంలో ఈదుతూ మట్టికట్టలపైకి చేరాయి. వీటిని చూసిన వారంతా గోదావరి పుష్కర స్నానాలకు వచ్చాయంటూ ఆశ్చర్యంగా తిలకించారు. వాటి చేష్టలు అక్కడి వారిని మంత్రముగ్ధులను చేశాయి.