
సాక్షి, విజయవాడ: గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం గొప్ప విషయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పౌర సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక వేత్తగా, ప్రజాస్వామ్యవాదిగా, గొప్ప మహిళగా ద్రౌపది ముర్ము అందరికీ ఆదర్శమన్నారు. దేశ చరిత్రలో ఆమె ఎప్పటికీ నిలిచిపోతారన్నారు.
కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న ముర్ము జీవితం అందరికీ ఆదర్శం. తన గ్రామంలో డిగ్రీ వరకూ చదువుకున్న తొలి మహిళగా ఆమె నిలిచారు. ముర్ము ఎదిగిన తీరు ప్రతీ మహిళకూ ఆదర్శనీయం. మహిళా సాధికారితకు ఆమె ఒక ప్రతిబింబం. రాష్ట్రపతి పదవికి ముర్ము వన్నె తీసుకొస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని సీఎం అన్నారు.
చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌర సన్మానం
Comments
Please login to add a commentAdd a comment