
కోల్‌కతాలో ‘సచిన్ కార్నివాల్’
కోల్‌కతా: సచిన్ టెండూల్కర్ చివరిసారిగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆడనుండడంతో కోల్‌కతా అంతటా మాస్టర్ ఫీవర్ కొనసాగుతోంది. ఓరకంగా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈనెల 6 నుంచి 10 వరకు వెస్టిండీస్‌తో తొలి టెస్టు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సచిన్‌ను ఏ రీతిన గౌరవించాలనే విషయంపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఓ జాబితాను రూపొందించింది.
ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు నగరానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి ముంబై నుంచి వచ్చిన మాస్టర్‌కు విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారి మధ్య నుంచి సచిన్‌ను బయటకు తీసుకురావడానికి భద్రతా సిబ్బంది తంటాలుపడ్డారు. మ్యాచ్‌కు ముందు క్యాబ్ ఏర్పాటు చేద్దామనుకున్న విందును... ఆట మీద దృష్టి సారించేందుకు వీలుగా సచిన్ వద్దన్నాడు.
కోల్‌కతాలో ఆదివారం కాళీ పూజ సందర్భంగా సచిన్ ఫొటోలతో అభిమానుల ప్రార్థన