కోల్కతా: భారత్ తొలిసారి జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ వేదిక ఖరారైంది. కోల్కతా నగరంలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం భారత్లో జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టుకు వేదిక కానుంది. సూపర్ లీగ్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ను ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహించనున్నారు. దీనిపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లను విజయవంతంగా నిర్వర్తించడానికి సాధ్యమైనన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దేశవాళీ లీగ్ లో భాగమైన సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ను ఇక్కడ డే అండ్ నైట్ టెస్టుగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
జూన్ 17వ తేదీ నుంచి 20 వరకూ ఈ జరిగే సూపర్ లీగ్ డే అండ్ నైట్ టెస్టు ఫైనల్ ను భారత్లో ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య డే అండ్ నైట్ టెస్టు జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే డే అండ్ నైట్ టెస్టు కోసం మొదటిసారిగా ‘కూకాబుర్రా’ పింక్ బంతులను ఉపయోగించనున్నారు.