Day-Night Test
-
ఆసీస్‌తో డే నైట్ టెస్టు ఆడబోం
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తమకు డే నైట్ టెస్టు ఆడే ఉద్దేశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు సీఏకు లేఖ రాసింది. ఆస్ట్రేలియా కొన్నేళ్లుగా తమ దేశానికి వస్తున్న జట్లతో ఒక టెస్టును డే నైట్‌గా ఆడుతోంది. ఇందులో భాగంగా డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభం కానున్న సిరీస్‌లోని తొలి టెస్టును గులాబీ బంతితో ఆడదామని భారత్‌కు ప్రతిపాదించింది. అయితే, గులాబీ బంతితో ఆడాలంటే కనీసం ఏడాదిన్నర సన్నాహకం ఉండాలంటూ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలోని జట్టు మేనేజ్మెంట్ దీనిని వ్యతిరేకించింది. ఇదే సందేశాన్ని సీఏ చీఫ్ జేమ్స్ సదర్లాండ్కు మెయిల్ చేసినట్లు బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌధరి తెలిపారు. -
డే అండ్ నైట్ ఉంటే గెలవలేరేమో!
సిడ్నీ: ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టెస్టు సిరీస్ గెలవాలనే లక్ష్యంతో ఉండటంతోనే డే–నైట్ టెస్టు ఆడనంటోందని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్ అన్నారు. ఓ రేడియో చానెల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఖరారు చేయడంలో ఆతిథ్య దేశానికే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎప్పుడు, ఎక్కడ ఆడాలనేది ఆతిథ్య దేశం నిర్ణయానికే వదిలేయాలన్నారు. ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ టెస్టులంటే ఇప్పటి వరకు గులాబీ రంగు కూకాబుర్రా బంతులతోనే జరుగుతున్నాయి. దీని నాణ్యత, స్పందించే తీరుపై బీసీసీఐ మొదటినుంచి వ్యతిరేకంగానే ఉంది. డే–నైట్ టెస్టుపై బీసీసీఐ పాలక కమిటీ చీఫ్ వినోద్ రాయ్‌ని సంప్రదించగా ‘ఇప్పటికే దానిపై మా వైఖరిని వెల్లడించాం. ఇక దీనిపై బోర్డు నిర్ణయం మార్చుకుంటుందని నేను అనుకోవడం లేదు. దేశవాళీ టోర్నీల్లో పింక్ బంతితో డే–నైట్ మ్యాచ్‌లను కొనసాగిస్తాం’ అని అన్నారు. గెలవడం కోసమే ఆడమంటున్నారని సదర్లాండ్ పేర్కొన్న వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి స్పందించారు. ఎవరైనా గెలవడం కోసమే ఆడతారని ఇందులో తప్పేమీ లేదని అన్నారు. మరోవైపు సదర్లాండ్ మాట్లాడుతూ ‘ట్యాంపరింగ్ వివాదంలో శిక్ష పడిన స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు తిరిగి జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశాలున్నాయి. ఆటను మరింత మెరుగుపర్చుకొని తమ విలువేమిటో సెలక్టర్లకు తెలపాలి. వాళ్లపై నాకు సానుభూతి ఉంది. వాళ్ల క్షమాపణల్ని మన్నించాం. తిరిగి వాళ్లందరినీ జాతీయ జట్టులో చూడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. -
ఆడనంటే... ఆడమంటోంది ఆసీస్
సిడ్నీ: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత్‌తో డే–నైట్ టెస్టు ఆడించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శతవిధాలా ప్రయత్నిస్తోంది. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో జరిగే తొలి టెస్టును పింక్ బంతితో డే–నైట్ ఆడించాలని సీఏ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ విషయాన్ని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేమ్స్ సదర్లాండ్ ధ్రువీకరించారు. ‘మా ప్రాధాన్యం డే–నైట్ టెస్టే. అందుకోసమే మేం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని ఒప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాం. ఇంకా సంప్రదింపుల దశలోనే ఉన్నప్పటికీ దీనిపై సానుకూల స్పందన వస్తుందనే ఆశిస్తున్నాం’ అని ఆయన అన్నారు. అడిలైడ్‌లో గత మూడేళ్లుగా నాలుగు డే–నైట్ టెస్టులు జరిగాయి. కివీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్‌లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఐదు రోజుల ఆట ఆడాయి. అలాగే ఈసారి భారత్‌తో ఆడాలని సీఏ చర్చలు జరుపుతోంది. బీసీసీఐ ఆడనంటోంది: ఏటా తమ దేశంలో ఒక టెస్టు మ్యాచ్‌నైనా డే–నైట్ ఆడించాలని ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంటే... బీసీసీఐ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. ఫ్లడ్‌లైట్ల టెస్టుపై భారత బోర్డు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని విశ్వసనీయంగా తెలిసింది. ఇది వరకే ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు తెలిపామని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఆసీస్‌లో భారత షెడ్యూలిదే: మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌తో ఆస్ట్రేలియా పర్యటన మొదలవుతోంది. నవంబర్ 21 నుంచి 25 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. డిసెంబర్ 6–10 వరకు అడిలైడ్‌లో తొలి టెస్టు, 14–18 వరకు పెర్త్‌లో రెండో టెస్టు, 26 నుంచి 30 వరకు మెల్బోర్న్లో మూడో టెస్టు, వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీలో ఆఖరి టెస్టు జరుగుతుంది. జనవరి 12 నుంచి 18 వరకు మూడు వన్డేల సిరీస్ ఉంటుంది. -
సంచలనం: ఐదుగురు డకౌట్
ఆక్లాండ్: ఇంగ్లండ్‌తో ప్రారంభమైన డే–నైట్ టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ సంచలనం నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్.. ఇంగ్లీషు టీమ్‌ను అత్యల్ప స్కోరుకే కుప్పకూల్చింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ట్రెంట్ బోల్ట్, టిమ్ సౌతి.. ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. పదునైన బంతులతో వీరిద్దరూ చెలరేగడంతో 20.4 ఓవర్లలో 58 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌటైంది. ఇంగ్లండ్‌కు ఇది ఓవరాల్‌గా ఆరో అతిస్వల్ప స్కోరు కావడం గమనార్హం. ఐదుగురు బ్యాట్స్‌మెన్ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యారు. జో రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్, మహ్మద్ అలీ, స్టువర్ట్ బ్రాడ్ డకౌటయ్యారు. ఓవర్టన్ (33), స్టోన్‌మన్(11) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బోల్ట్ 32 పరుగులిచ్చి 6 వికెట్లు నేలకూల్చాడు. సౌతి 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరూ మూడేసి మేడిన్ ఓవర్లు వేయడం విశేషం. -
మళ్లీ ఫలితం వచ్చేనా?
ఆక్లాండ్: సంప్రదాయ క్రికెట్ అభిమానులకు మరో కనువిందు. గులాబీ బంతితో జరిగే డే–నైట్ టెస్టుల రికార్డుల్లోకి ఇంకో మ్యాచ్. ఈసారి వేదిక న్యూజిలాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానం. తలపడనున్న జట్లు న్యూజిలాండ్, ఇంగ్లండ్. 2015 చివర్లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో చరిత్రాత్మక తొలి డే–నైట్ టెస్టులో ఆడిన న్యూజిలాండ్... ఇప్పుడు మొదటిసారి తమ దేశంలో ఆతిథ్యమిస్తోంది. ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. బలాబలాలరీత్యా ప్రస్తుతం రెండు జట్లు సమ ఉజ్జీగా కనిపిస్తున్నా... గత ఐదు ముఖాముఖి టెస్టుల్లో ఇంగ్లండ్ మూడు గెలిచి, ఒకదాంట్లో ఓడింది. మరోటి ‘డ్రా’ అయింది. ఇటీవల వన్డే సిరీస్‌నూ ఇంగ్లండ్ 3–2తో నెగ్గింది. అయితే సొంతగడ్డపై ఆడుతుండటం, ఫామ్‌లో ఉన్న రాస్ టేలర్ ఫిట్నెస్ సాధించి అందుబాటులోకి రావడం విలియమ్సన్ జట్టుకు సానుకూలాంశం కానుంది. స్పిన్నర్ సాన్‌ట్నర్ స్థానంలో టాడ్ ఆస్టిల్‌ను ఆడించనుంది. వాట్లింగ్ కీపింగ్ బాధ్యతలు అందుకోనున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ కీలక ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో పునరాగమనం చేయనున్నాడు. అతడు తుది జట్టులో ఉంటాడని కెప్టెన్ జో రూట్ తెలిపాడు. బ్రిస్టల్ నైట్ క్లబ్ ఉదంతంతో కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన స్టోక్స్ ఇటీవలే కివీస్‌పై వన్డే సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. పేసర్ బ్రాడ్ మరో వికెట్ తీస్తే అండర్సన్ (523 వికెట్లు) తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున 400 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ అవుతాడు. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది డే–నైట్ టెస్టులు జరిగాయి. ఎనిమిదింటిలోనూ ఫలితాలు వచ్చాయి. అత్యధికంగా అడిలైడ్ మైదానంలో మూడు డే–నైట్ టెస్టులు జరిగాయి. -
ఇక... విండీస్‌లో డేనైట్ టెస్టు
కొలంబో: వెస్టిండీస్ గడ్డపై తొలి డేనైట్ టెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది కరీబియన్ పర్యటనకు వెళ్లే శ్రీలంక అక్కడ డేనైట్ టెస్టు మ్యాచ్ ఆడనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బార్బడోస్‌లో జూన్ 23 నుంచి జరిగే చివరి టెస్టును డేనైట్ మ్యాచ్‌గా నిర్వహిస్తారు. విండీస్ రెండు డేనైట్ టెస్టులాడినప్పటికీ సొంతగడ్డపై ఆడలేదు. శ్రీలంక మాత్రం పాక్‌తో యూఏఈలో గతేడాది ఈ ఫ్లడ్‌లైట్ల మ్యాచ్ ఆడింది. మూడేళ్ల క్రితం (2015) ఆస్ట్రేలియా–న్యూజిలాండ్‌ల మధ్య పింక్ బాల్‌తో జరిగిన ఐదురోజుల ఆటతో ‘డేనైట్’ హవా మొదలైంది. -
ఈడెన్‌లో తొలి డే అండ్ నైట్ టెస్టు!
కోల్‌కతా: భారత్ తొలిసారి జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ వేదిక ఖరారైంది. కోల్‌కతా నగరంలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం భారత్‌లో జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టుకు వేదిక కానుంది. సూపర్ లీగ్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ను ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించనున్నారు. దీనిపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వర్తించడానికి సాధ్యమైనన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దేశవాళీ లీగ్ లో భాగమైన సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ను ఇక్కడ డే అండ్ నైట్ టెస్టుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 17వ తేదీ నుంచి 20 వరకూ ఈ జరిగే సూపర్ లీగ్ డే అండ్ నైట్ టెస్టు ఫైనల్ ను భారత్‌లో ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య డే అండ్ నైట్ టెస్టు జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే డే అండ్ నైట్ టెస్టు కోసం మొదటిసారిగా ‘కూకాబుర్రా’ పింక్ బంతులను ఉపయోగించనున్నారు. -
డే నైట్ టెస్టు నిర్వహిస్తాం
కోల్‌కతా: భవిష్యత్‌లో పింక్ బంతితో డే నైట్ టెస్టు మ్యాచ్‌ను ఈడెన్‌లో నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. తొలుత తమ దగ్గర ఒక క్లబ్ మ్యాచ్‌ను ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించాలని అనుకుంటున్నామని, దీని కోసం బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉందని చెప్పారు.