ఇక... విండీస్‌లో డేనైట్‌ టెస్టు  | West Indies to host first day-night Test against Sri Lanka | Sakshi
Sakshi News home page

ఇక... విండీస్‌లో డేనైట్‌ టెస్టు 

Published Wed, Feb 7 2018 1:35 AM | Last Updated on Wed, Feb 7 2018 1:36 AM

West Indies to host first day-night Test against Sri Lanka - Sakshi

బార్బడోస్‌

కొలంబో: వెస్టిండీస్‌ గడ్డపై తొలి డేనైట్‌ టెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది  కరీబియన్‌ పర్యటనకు వెళ్లే శ్రీలంక అక్కడ డేనైట్‌ టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బార్బడోస్‌లో జూన్‌ 23 నుంచి జరిగే చివరి టెస్టును డేనైట్‌ మ్యాచ్‌గా నిర్వహిస్తారు.

విండీస్‌ రెండు డేనైట్‌ టెస్టులాడినప్పటికీ సొంతగడ్డపై ఆడలేదు. శ్రీలంక మాత్రం పాక్‌తో యూఏఈలో గతేడాది ఈ ఫ్లడ్‌లైట్ల మ్యాచ్‌ ఆడింది.  మూడేళ్ల క్రితం (2015) ఆస్ట్రేలియా–న్యూజిలాండ్‌ల మధ్య పింక్‌ బాల్‌తో జరిగిన ఐదురోజుల ఆటతో ‘డేనైట్‌’ హవా మొదలైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement