ఆక్లాండ్: సంప్రదాయ క్రికెట్ అభిమానులకు మరో కనువిందు. గులాబీ బంతితో జరిగే డే–నైట్ టెస్టుల రికార్డుల్లోకి ఇంకో మ్యాచ్. ఈసారి వేదిక న్యూజిలాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానం. తలపడనున్న జట్లు న్యూజిలాండ్, ఇంగ్లండ్. 2015 చివర్లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో చరిత్రాత్మక తొలి డే–నైట్ టెస్టులో ఆడిన న్యూజిలాండ్... ఇప్పుడు మొదటిసారి తమ దేశంలో ఆతిథ్యమిస్తోంది. ఇంగ్లండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. బలాబలాలరీత్యా ప్రస్తుతం రెండు జట్లు సమ ఉజ్జీగా కనిపిస్తున్నా... గత ఐదు ముఖాముఖి టెస్టుల్లో ఇంగ్లండ్ మూడు గెలిచి, ఒకదాంట్లో ఓడింది. మరోటి ‘డ్రా’ అయింది. ఇటీవల వన్డే సిరీస్‌నూ ఇంగ్లండ్ 3–2తో నెగ్గింది. అయితే సొంతగడ్డపై ఆడుతుండటం, ఫామ్‌లో ఉన్న రాస్ టేలర్ ఫిట్‌నెస్ సాధించి అందుబాటులోకి రావడం విలియమ్సన్ జట్టుకు సానుకూలాంశం కానుంది. స్పిన్నర్ సాన్‌ట్నర్ స్థానంలో టాడ్ ఆస్టిల్‌ను ఆడించనుంది.
వాట్లింగ్ కీపింగ్ బాధ్యతలు అందుకోనున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ కీలక ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో పునరాగమనం చేయనున్నాడు. అతడు తుది జట్టులో ఉంటాడని కెప్టెన్ జో రూట్ తెలిపాడు. బ్రిస్టల్ నైట్ క్లబ్ ఉదంతంతో కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన స్టోక్స్ ఇటీవలే కివీస్‌పై వన్డే సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. పేసర్ బ్రాడ్ మరో వికెట్ తీస్తే అండర్సన్ (523 వికెట్లు) తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున 400 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ అవుతాడు. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది డే–నైట్ టెస్టులు జరిగాయి. ఎనిమిదింటిలోనూ ఫలితాలు వచ్చాయి. అత్యధికంగా అడిలైడ్ మైదానంలో మూడు డే–నైట్ టెస్టులు జరిగాయి.
మళ్లీ ఫలితం వచ్చేనా?
Published Thu, Mar 22 2018 1:13 AM | Last Updated on Thu, Mar 22 2018 1:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment