
ఈడెన్ లో వరల్డ్ కప్ టి20 ఫైనల్
వచ్చే ఏడాది జరగనున్న 2016 వరల్డ్ కప్ టి20 మ్యాచ్ లకు వేదికలు ఖరారయ్యాయి.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న 2016 వరల్డ్ కప్ టి20 మ్యాచ్ లకు వేదికలు ఖరారయ్యాయి. 8 నగరాల్లో మ్యాచ్ లు జరుగుతాయని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. బెంగళూరు, చెన్నై, ధర్మశాల, మొహాలి, కోల్ కతా, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ నగరాల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు.
ఫైనల్ మ్యాచ్ కు ఈడెన్ గార్డెన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు వరల్డ్ కప్ టి20 టోర్నమెంట్ జరగనుంది. నిర్దేశిత అవసరాలకు అనుగుణంగా వేదికలు ఎంపిక చేసినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.