అజహర్‌ బెల్‌ కొట్టడంపై గంభీర్‌ గుస్సా! | Gautam Gambhir Slams BCCI And CAB  | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 5 2018 2:41 PM | Last Updated on Mon, Nov 5 2018 2:44 PM

Gautam Gambhir Slams BCCI And CAB  - Sakshi

కోల్‌కతా : భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ ఆదివారం తొలి టీ20 మ్యాచ్‌కు ముందు ఈడెన్‌ గార్డెన్స్‌లో గంట మోగించడంపై సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో బీసీసీఐ, బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (సీఏబీ), సీఓఏలను ట్విటర్‌ వేదికగా తప్పుబట్టాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం కారణంగా నిషేదం ఎదుర్కొన్న క్రికెటర్‌తో ఎలా బెల్‌ కొట్టిస్తారని పరోక్షంగా ప్రశ్నించాడు.

‘ఈడెన్‌లో భారత్‌ ఈ రోజు మ్యాచ్‌ గెలువచ్చు కానీ బీసీసీఐ, సీఓఏ, సీఏబీలు గౌరవాన్ని కోల్పోయాయి. ఆదివారమని అవినీతికి వ్యతిరేకంగా పనిచేయకుండా సెలవుతీసుకున్నట్లు కనబడుతోంది. అతన్ని హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతినిచ్చిన విషయం నాకు తెలుసు. కానీ అతను బెల్‌కొట్టడమే నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.’అని గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. 

భారత్‌ తరపున 99 టెస్ట్‌లు, 334 వన్డేలాడిన అజహరుద్దీన్‌ 2000లో మ్యాచ్ ఫిక్సింగ్‌ వివాదంతో బీసీసీఐ నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేదాన్ని 2012లో హైదరాబాద్‌ హైకోర్టు ఎత్తేసింది. అప్పటి నుంచి అజహర్‌ క్రికెట్‌లో అధికారిక కార్యకలపాల్లో పాలుపంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నంగా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసాడు. నిషేదంపై స్పష్టత లేదని తొలుత నిరాకరించిన బీసీసీఐ ఆ తరువాత అనుమతినించింది. అలాగే బీసీసీఐ, ఐసీసీల్లో ఎలాంటి బాధ్యతలు చేపట్టకుండా అతనిపై నిషేధం విధించలేమని కూడా స్పష్టం చేసింది.

హైదరాబాదీ అజహర్‌కు ఈడెన్‌తో ప్రత్యేక అనుబంధం ఉండటంతో అతను భారత్‌-వెస్టిండీస్ తొటి టీ20కు ముందు గంట మోగించారు. తన తొలి టెస్టు మ్యాచ్‌ను ఇక్కడే ఆడి సెంచరీ చేసిన అజహర్‌ ఆ తర్వాత ఆడిన మరో 6 టెస్టుల్లో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సాధించాడు. టెస్టుల్లో భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీని (74 బంతుల్లో) అజహర్‌ 1996లో దక్షిణాఫ్రికాపై ఈడెన్‌లోనే నమోదు చేశాడు. 1993లో ఇదే వేదికపై అతని కెప్టెన్సీలో భారత్‌ వన్డే టోర్నీ ‘హీరో కప్‌’ నెగ్గింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement