సచిన్ను తప్పుకోవాలని కోరనున్న బీసీసీఐ | BCCI to Ask Sachin Tendulkar to Retire After 200th Test? | Sakshi
Sakshi News home page

సచిన్ను తప్పుకోవాలని కోరనున్న బీసీసీఐ

Published Mon, Sep 30 2013 1:51 PM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM

సచిన్ను తప్పుకోవాలని కోరనున్న బీసీసీఐ

సచిన్ను తప్పుకోవాలని కోరనున్న బీసీసీఐ

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన రిటైర్మెంట్పై ఇప్పటివరకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన రిటైర్మెంట్పై ఇప్పటివరకు ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అయితే 200వ టెస్టు మ్యాచ్ అతడికి చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సచిన్ షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ ఆడిన తర్వాత తప్పుకోవాలని సచిన్ను కోరేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్టు 'ముంబై మిర్రర్' పత్రిక తెలిపింది. ఈ విషయాన్ని మాస్టర్కు సూచనప్రాయంగా వెల్లడించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే సచిన్ మాత్రం ఇప్పట్లో రిటైర్ కావాలని అనుకోవడం లేదు.

మరోవైపు సచిన్ తన చరిత్రాత్మక ఈడెన్‌గార్డెన్స్‌లో ఆడే అవకాశం ఉంది. ఆదివారం జరిగిన బీసీసీఐ ఏజీఎంలో ఈ అంశంపై చర్చించారని... ఈడెన్‌లోనే సచిన్ రికార్డు టెస్టు జరిగే అవకాశం ఉందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రాజీవ్ శుక్లా నేతృత్వంలోని టూర్స్ అండ్ ఫిక్చర్స్ కమిటీ అక్టోబరు 3న సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత... సచిన్ 200వ టెస్టు ఎక్కడ ఆడేది అధికారికంగా ప్రకటిస్తారు. మాస్టర్ 199వ టెస్టును అహ్మదాబాద్‌లో నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికాలో భారత పర్యటనపై ఇంకా అనిశ్చితి తొలగలేదు. ఏజీఎంలో ఈ అంశం గురించి చర్చే జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement