
ముచ్చట్లు పెట్టిన రైనా, షోయబ్..
కోల్‌కతా : ఈసారి టీ20 ప్రపంచ కప్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భారత్ లోనే మాకు ఫ్యాన్స్ ఎక్కువ అంటూ ఇటీవల పాక్ కెప్టెన్ అఫ్రిది వ్యాఖ్యలు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. కాగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ఇరు టీమ్లు బుధవారం సాయంత్రమే కోల్‌కతాకు చేరుకున్నాయి.
అయితే అక్కడి పరిస్థితులు మాత్రం మునుపటి కంటే భిన్నంగా కనిపించాయి. భారత్, పాక్ క్రికెటర్లు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. భారత స్టార్ ప్లేయర్ సురేష్ రైనా, పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ చాలాసేపు ముచ్చట్లు పెట్టారు. కనిపించగానే ఆలింగనం చేసుకున్న ఈ ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకుంటూ గడిపారు.
భారత జట్టు గురువారం దాదాపుగా హోటల్‌కే పరిమితమయింది. ప్రాక్టీస్ ఆప్షనల్ కావడంతో కేవలం రైనా, రహానే, నేగి మాత్రమే స్టేడియానికి వెళ్లారు. కోచ్ సంజయ్ బంగర్ సాయంతో రైనా ఫుల్ షాట్‌లు ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు పాకిస్తాన్ జట్టులో కూడా కేవలం ఐదుగురు మాత్రమే ప్రాక్టీస్‌కు వచ్చారు.