భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఖారారు చేయడంతో.. ఈ టోర్నీలో పాల్గొనే జట్లు తమ వ్యహాలను రచించడం మొదలుపెట్టేశాయి. ఈ మెగా టోర్నీ భారత్‌లోని పది వేదికల్లో అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు జరగనుంది.
అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ విషయానికి వస్తే... అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అనంతరం క్రికెట్ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురు చూసే దాయాదుల పోరు అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరగనుంది.
ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్..
ఇక ఈ మెగా ఈవెంట్‌కు అతిథ్యం ఇవ్వనున్న వేదికలలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఒకటి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐదు లీగ్ మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్-2 కూడా జరగనుంది. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ ధరలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) వెల్లడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా షెడ్యూల్ చేయబడిన అన్ని మ్యాచ్‌ల ధరలు రూ. 650 నుండి రూ. 3000 వరకు ఉంటాయి.
బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ టిక్కెట్ ధరలు
అప్పర్ టైర్స్ రూ.650.
D మరియు H బ్లాక్‌లకు రూ.1000.
B, C, K, L బ్లాక్‌లకు రూ.1500.
ఇంగ్లండ్ vs పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్ ధరలు
అప్పర్ టైర్స్ రూ.800.
డి, హెచ్ బ్లాక్‌లు రూ.1200
సి, కె, బ్లాక్‌లు రూ.2000
BL బ్లాక్‌లు రూ.2200
బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ ధరలు
అప్పర్ టైర్స్ రూ.800
డి, హెచ్ బ్లాక్‌లు రూ.1200
సి, కె, బ్లాక్‌లు రూ.2000
BL బ్లాక్‌లు రూ.2200
ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ టిక్కెట్ ధరలు
అప్పర్ టైర్స్ రూ. 900.
డి, హెచ్ బ్లాక్‌లు రూ.1500
సి, కె, బ్లాక్‌లు రూ.2500
BL బ్లాక్‌లు రూ.3000
సెమీ-ఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్ ధరలు
అప్పర్ టైర్స్ రూ. 900.
డి, హెచ్ బ్లాక్‌లు రూ.1500.
సి, కె, బ్లాక్‌లు రూ.2500.
BL బ్లాక్‌లు రూ.3000.
చదవండి: TNPL 2023 DD Vs NRK: మరో 'రింకూ సింగ్'.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సంచలనం
Comments
Please login to add a commentAdd a comment