
‘గులాబీ’ గుబాళిస్తుంది!
పింక్ బంతిపై గంగూలీ నమ్మకం
కోల్‌కతా: క్రికెట్‌లో గులాబీ బంతుల వినియోగాన్ని కొత్త ఆకర్షణగా భావించాలని, ఈ ప్రయోగం మన దేశంలో కూడా విజయవంతమవుతుందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయ పడ్డారు. భారత్‌లో పింక్ బంతిని ఉపయోగిస్తూ తొలి డే అండ్ నైట్ మ్యాచ్ రేపటినుంచి ఈడెన్‌గార్డెన్స్‌లో నాలుగు రోజుల పాటు జరగనుంది. భవానీపూర్ క్లబ్, మోహన్ బగాన్ జట్ల మధ్య ఈ ‘క్యాబ్’ సూపర్ లీగ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. మ్యాచ్ కోసం పింక్ కూకాబుర్రా బంతిని వాడనున్నారు.
మరో వైపు భారత టాప్ స్పిన్నర్ అశ్విన్‌కు ఈ బంతినిచ్చి అది ఎలా టర్న్ అవుతుందో పరీక్షించాలని వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. ఈ నాలుగు రోజుల మ్యాచ్ మధ్యాహ్నం 2.30నుంచి రాత్రి 9 వరకు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కూడా కానుంది.