
ఐపీఎల్-2025 షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జైయింట్స్ మధ్య ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్‌ను గౌహతికి తరలించారు. అదే రోజు శ్రీ రామ నవమి ఉండటంతో భద్రత కల్పించలేమని కోల్‌కతా పోలీసులు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశారు.ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో బెంగాల్ క్రికెట్ బోర్డు చర్చింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ పాలకమండలి వేదికను గౌహతికి మార్చింది.
ఈ వేదిక మార్పును బీసీసీఐ కూడా ఆమోదించింది. కాగా రామ నవమి వేడుకల కారణంగా కోల్‌కతాలో ఐపీఎల్ మ్యాచ్‌లను రీ షెడ్యూల్ చేయడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది కూడా ఏప్రిల్ 17న జరగాల్సిన కోల్‌కతా వేదికగా కేకేఆర్-రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను రామ నవమి కారణంగా.. ఒకరోజు ముందు (ఏప్రిల్ 16న) నిర్వహించారు.
ఇందుకోసం మరో మ్యాచ్‌ను బీసీసీఐ రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. వాస్తవానికి గౌహతిలోని అస్సాం క్రికెట్ అసోషియేషన్ స్టేడియం రాజస్తాన్ రాయల్స్‌కు సెకెండ్ హోం గ్రౌండ్‌గా ఉంది. రాజస్తాన్ టీమ్ ఈ వేదికలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మైదానంలో రాజస్తాన్ మార్చి 26న కేకేఆర్‌తో, మార్చి 30న చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది.
కాగా ఈ మెగా ఈవెంట్ మొత్తం 13 వేదికల్లో జరగనుంది. ఐపీఎల్-18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: CT 2025: ‘రూ. 739 కోట్ల నష్టం’.. పాక్ క్రికెట్ బోర్డు స్పందన ఇదే!
Comments
Please login to add a commentAdd a comment