'చివరి టెస్టు 'ఈడెన్'లో ఆడాలని ఉంది'
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్లో చివరి టెస్టు ఆడిన తర్వాతే తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని కోరుకుంటున్నట్టు వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్సింగ్ తన మనసులోని మాట బయటపెట్టారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ 'టర్బోనేటర్' భజ్జీకి కలిసొచ్చిన మైదానం. 2001లో జరిగిన ఓ టెస్టులో 13 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను చిత్తుచేశాడు అతను. అంతేకాకుండా హ్యాట్రిక్ వికెట్లు తీశాడు.
భజ్జీ బుధవారం కోల్కతాలో విలేకరులతో మాట్లాడుతూ '(రిటైర్మెంట్ గురించి) ఇంకా నేనేమీ నిర్ణయించుకోలేదు. కానీ నేనెప్పుడు చివరి మ్యాచ్ ఆడాలనుకున్నా నా మదిలో ఈడెన్ గార్డెన్స్ మెదులుతుంది. ఇక్కడ చివరి మ్యాచ్ ఆడిన తర్వాతే రిటైర్ కావాలని నేను కోరుకుంటున్నాను' అని అన్నారు. 2010లో ఈడెన్ లో జరిగిన టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఇన్నింగ్స్ 40 పరుగులతో ఓడించడంలోనూ భజ్జీ కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో అప్పట్లో భారత క్రికెట్ జట్టు టెస్టుల్లో టాప్ స్థానాన్ని సాధించింది.