IND VS WI T20 Series: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా రేపటి(ఫిబ్రవరి 16) నుంచి ప్రారంభంకానున్నటీ20 సిరీస్‌కు ముందు భారత అభిమానులకు ఓ చేదు వార్త వినిపించింది. కరోనా కారణంగా రేపు జరగబోయే తొలి టీ20 మ్యాచ్‌కు ప్రేక్షకులను అనమతించేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కనీసం 50 శాతం ప్రేక్షకులనైనా అనుమతిస్తారని అభిమానులు భావించినప్పటికీ.. బీసీసీఐ అందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో ఖాళీ స్టేడియంలోనే తొలి టీ20 మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది.
కనీసం ఇదే వేదికగా జరగబోయే రెండు, మూడు మ్యాచ్‌లకైనా ప్రేక్షకులను అనుమతించాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) కోరగా.. త్వరలోనే తుది నిర్ణయం వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ ప్రారంభ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాంటి రిస్క్‌లు అవసరం లేదని భావిస్తున్న బీసీసీఐ.. అవకాశం ఉన్నా ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్, యజ్వేంద్ర చహల్, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్.
వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్ షెపర్డ్, ఓడియన్ స్మిత్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ జూనియర్.
చదవండి: Ind Vs Wi T20 Series: పంత్‌కు బంపర్ ఆఫర్.. వైస్ కెప్టెన్‌గా ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment