రవి బిష్ణోయిపై రోహిత్ శర్మ ప్రశంసలు(PC: BCCI)
Ind Vs Wi 1st T20: టీమిండియా యువ బౌలర్ రవి బిష్ణోయిపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. రవి ప్రతిభావంతుడని, అతడి ఆట తీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు. మొదటి మ్యాచ్‌లోనే ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడని... భవిష్యత్తులో మరింత గొప్పగా రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందిన సంగతి తెలిసిందే. కోల్‌కతాలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
బ్యాటర్లలో రోహిత్ శర్మ(40), ఇషాన్ కిషన్(35), సూర్యకుమార్ యాదవ్(34) రాణించారు. ఇక అరంగేట్ర మ్యాచ్‌లో 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు రవి బిష్ణోయి. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు ఈ 21 ఏళ్ల యువ స్పిన్నర్. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... రవి బిష్ణోయిని ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘‘బిష్ణోయి అత్యంత ప్రతిభావంతుడు. అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం. తనలో ఏదో ప్రత్యేకత ఉంది.
అతడి బౌలింగ్‌లో వైవిధ్యం ఉంది. అద్భుతమైన నైపుణ్యం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తను చక్కగా బౌలింగ్ చేయగలడు. తన ప్రదర్శనతో బౌలింగ్ విభాగంలో మాకు మరిన్ని ఆప్షన్లు దొరికేలా చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. ఇక తన సేవలను ఎలా ఉపయోగించుకోవాలన్న విషయం గురించి ఆలోచిస్తాం’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
కాగా రాజస్తాన్‌కు చెందిన బిష్ణోయ్ 42 దేశవాళీ టి20 మ్యాచ్‌లలో 6.63 ఎకానమీతో 49 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలంలో నేపథ్యంలో కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జాయింట్స్ జట్టు రవిని 4 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: IND VS WI: సూర్య మాటకు కట్టుబడిన వెంకటేశ్ అయ్యర్.. వీడియో వైరల్
💬 💬 "Very happy with his first game for India. He has got a very bright future." #TeamIndia captain @ImRo45 lauds @bishnoi0056 following his superb performance on debut. 👏 👏#INDvWI @Paytm pic.twitter.com/YmxUF2JYrY
— BCCI (@BCCI) February 16, 2022
Comments
Please login to add a commentAdd a comment