IND vs WI T20 series 2023: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో టీమిండియా యువ ఆటగాళ్లు కరేబియన్ దీవికి పయనమయ్యారు. బౌలర్లు రవి బిష్ణోయి, ఆవేశ్ ఖాన్‌లతో పాటు తొలిసారి జట్టుకు ఎంపికైన తిలక్ వర్మ తదితరులు విమానంలో విండీస్‌కు బయల్దేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను వీరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అడిడాస్ రూపొందించిన బ్లాక్ కలర్ ట్రెయినింగ్ జెర్సీలు ధరించిన రవి, ఆవేశ్, తిలక్.. విమానంలో చిల్ అవుతూ ఫొటోలకు పోజులిచ్చారు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
నెల రోజుల పర్యటన
జూలై 12న మొదటి టెస్టుతో ఈ టూర్ మొదలైంది. ఇక రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకోగా.. గురువారం(జూలై 27) నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే వైస్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, సంజూ శాంసన్ తదితర ఆటగాళ్లు విండీస్‌కు చేరుకున్నారు.
తిలక్ వర్మ ఎంట్రీ ఖాయం!
ఇక ఆగష్టు 1న వన్డే సిరీస్ ముగియనుండగా.. 3 నుంచి టీ20 సిరీస్ మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. విండీస్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం డొమినికా మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టాడు.
రెండో టెస్టు సందర్భంగా యువ పేసర్ ముకేశ్ కుమార్ సైతం ఎంట్రీ ఇచ్చాడు. బలహీన విండీస్‌పై ఇలా వరుసగా టీమిండియా యంగ్ క్రికెటర్ల అరంగేట్రాల నేపథ్యంలో టీ20 సిరీస్‌లోనూ కొత్త ముఖాలు చూసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున మంచి హిట్టర్‌గా పేరొందిన హైదరాబాదీ తిలక్ వర్మ కూడా క్యాప్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఆగష్టు 3- 13 వరకు జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20కి హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనుండగా.. సూర్యకుమార్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్.
చదవండి: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె!
Comments
Please login to add a commentAdd a comment