IPL 2024 KKR vs RR Live Updates:
బట్లర్ విరోచిత సెంచరీ.. కేకేఆర్‌పై రాజస్తాన్ సంచలన విజయం
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. రాజస్తాన్ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు.
బట్లర్ విరోచిత సెంచరీతో చెలరేగాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 పరుగులతో ఆజేయంగా నిలిచి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఈ సీజన్‌లో బట్లర్‌కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌లో బట్లర్‌తో పాటు రియాన్ పరాగ్(34), పావెల్(26) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఇక కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది.కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్(109) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
109 బంతులు ఎదుర్కొన్న నరైన్.. 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు రఘువంశీ(30), రింకూ సింగ్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్‌ఖాన్, కుల్దీప్ సేన్ తలా రెండు వికెట్లు సాధించగా.. చాహల్, బౌల్ట్ తలా వికెట్ పడగొట్టారు.
ఏడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. పావెల్ ఔట్
రావ్‌మెన్ పావెల్ రూపంలో రాజస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(67) పరుగలుతో ఉన్నారు. రాజస్తాన్ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు కావాలి.
వరుణ్ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకు రాజస్తాన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. రాజస్తాన్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన చక్రవర్తి బౌలింగ్‌లో తొలుత అశ్విన్ ఔట్ కాగా.. ఆ తర్వాత హెట్‌మైర్ పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(40), పావెల్(1) పరుగులతో ఉన్నారు.
రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్.. జురెల్ ఔట్
రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్.. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 4 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(24), రవిచంద్రన్ అశ్విన్(0) పరుగులతో ఉన్నారు.
రాజస్తాన్ మూడో వికెట్ డౌన్..
రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన పరాగ్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(24) పరుగులతో ఉన్నారు.
దంచి కొడుతున్న పరాగ్..
7 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో రియాన్ పరాగ్(23),జోస్ బట్లర్(23) పరుగులతో ఉన్నారు.
రాజస్తాన్ రెండో వికెట్ డౌన్.. శాంసన్ ఔట్
47 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సంజూ శాంసన్.. హర్షిత్ రానా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి పరాగ్ వచ్చాడు. 5 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 53/2
రాజస్తాన్ తొలి వికెట్ డౌన్.. జైశ్వాల్ ఔట్
224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. వైభవ్ ఆరోరా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 36/1. క్రీజులో జోస్ బట్లర్(11), సంజూ శాంసన్(3) పరుగులతో ఉన్నారు.
నరైన్ సూపర్ సెంచరీ.. రాజస్తాన్ టార్గెట్ 224 పరుగులు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది.కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్(109) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.
109 బంతులు ఎదుర్కొన్న నరైన్.. 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు రఘువంశీ(30), రింకూ సింగ్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్‌ఖాన్, కుల్దీప్ సేన్ తలా రెండు వికెట్లు సాధించగా.. చాహల్, బౌల్ట్ తలా వికెట్ పడగొట్టారు.
కేకేఆర్ ఐదో వికెట్ డౌన్..నరైన్ ఔట్
సునీల్ నరైన్ రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 109 పరుగులు చేసిన నరైన్.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 198/5
కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్.. రస్సెల్ ఔట్
రస్సెల్ రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రస్సెల్ అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
సునీల్ నరైన్ సెంచరీ
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. నరైన్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. 16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 184/3. క్రీజులో సునీల్ నరైన్(100), రస్సెల్(13) పరుగులతో ఉన్నారు.
కేకేఆర్ మూడో వికెట్ డౌన్.. శ్రేయస్ అయ్యర్ ఔట్
133 పరుగుల వద్ద కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
రెండో వికెట్ డౌన్..
106 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన రఘువంశీ.. కుల్దీప్ సేన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 12 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి కేకేఆర్ 125 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(70), శ్రేయస్ అయ్యర్(4) పరుగులతో ఉన్నారు.
సునీల్ నరైన్ ఫిప్టీ.. 29 బంతుల్లోనే
సునీల్ నరైన్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 29 బంతుల్లో నరైన్ తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. క్రీజులో సునీల్ నరైన్(51), రఘువంశీ(30) పరుగులతో ఉన్నారు
7 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 64/1
7 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(24), రఘు వంశీ(21) ఉన్నారు.
కేకేఆర్ తొలి వికెట్ డౌన్.. సాల్ట్ ఔట్
21 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రఘువంశీ వచ్చాడు.
3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 20/0
3 ఓవర్లు ముగిసే సరికి కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(6),ఫిల్ సాల్ట్(10) పరుగులతో ఉన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఆర్‌ఆర్ జట్టులోకి జోస్ బట్లర్, అశ్విన్ వచ్చారు.
తుది జట్లు
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
Comments
Please login to add a commentAdd a comment