రాయల్స్‌కు మూడో స్థానం
రేపటి నుంచి ప్లే ఆఫ్స్
గువాహటి: ఈ ఐపీఎల్ సీజన్‌లో లీగ్ దశలోని చివరి మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్‌ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వాన అడ్డుగా నిలిచింది. రాత్రి పదిన్నరకు వర్షం తెరిపినిచ్చినట్లే కనిపించడంతో మైదానం పరిస్థితుల్ని పరిశీలించిన ఫీల్డు అంపైర్లు అనిల్ చౌదరి, సాయిదర్శన్ ఎట్టకేలకు 7 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
వెంటనే టాస్ కూడా వేయగా... కోల్‌కతా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆటగాళ్లు బరిలోకి దిగడమే తరువాయి అని ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూడగా ... మళ్లీ వానొచ్చి మ్యాచ్ రాతను మార్చింది. కటాఫ్ సమయం రాత్రి 10.56 గంటలకు చేసేదేమీ లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజస్తాన్, కోల్‌కతా చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి. ఈ సీజన్‌లో రద్దయిన నాలుగో మ్యాచ్ ఇది. దీంతో ఇప్పటికే అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్న నైట్‌రైడర్స్‌కు ఏ నష్టం లేదు.
కానీ వారం క్రితం దాకా ‘టాప్’లో కొనసాగిన రాజస్తాన్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. హైదరాబాద్, రాజస్తాన్ జట్లు 17 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా హైదరాబాద్‌కు రెండో స్థానం ఖరారైంది. ఆఖరి పోరులో నెగ్గి కనీసం రెండో స్థానంలో నిలిచి క్వాలిఫయర్–1, ఓడితే క్వాలిఫయర్–2 ఆడాల్సిన రాజస్తాన్ చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఎలిమినేటర్‌లో పోరాడాల్సిన పరిస్థితి వచి్చంది.
Comments
Please login to add a commentAdd a comment