ఐపీఎల్-2024లో భాగంగా గౌహతి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. గౌహతిలో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. అయితే మధ్యలో వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 7 ఓవర్లకు కుదించారు.
టాస్ కూడా పడింది. కానీ మళ్లీ వర్షం తిరుగుముఖం పట్టడంతో అంపైర్‌లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇక ఈ మ్యాచ్ రద్దు కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్ధానాన్ని సుస్ధిరం చేసుకుంది.
అయితే రాజస్తాన్ ఖాతాలో కూడా 17 పాయింట్లు ఉన్నప్పటకి.. ఆ జట్టు కంటే ఎస్ఆర్‌హెచ్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది. ఈ క్రమంలోనే రాజస్తాన్ జట్టు ఎస్ఆర్‌హెచ్‌ను పాయింట్ల పట్టికలో అధిగమించలేకపోయింది.
మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ 19 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్‌కు కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ చేరాయి.
మే 21న జరగనున్న తొలి క్వాలిఫియర్‌లో కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ జట్లు తలపడునున్నాయి. మే 22న ఎలిమినేటర్‌లో ఆర్సీబీ, రాజస్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment