Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 176 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కేకేఆర్ బౌలర్లపై రాహుల్ త్రిపాఠి ఎదురుదాడికి దిగాడు. త్రిపాఠి 37 బంతుల్లో 71 పరుగులు చేసి ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా అద్భుతమైన ప్రదర్శన చేసిన త్రిపాఠి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ఈ క్రమంలో పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో త్రిపాఠి మాట్లాడాడు. "కేకేఆర్‌పై ఇటువంటి ఇన్నింగ్స్ ఆడడం సంతోషంగా ఉంది. నాకు చాలా సార్లు కఠినమైన పరిస్థితులు ఎదరయ్యాయి. కానీ నేను కష్టపడి పని చేయడం వలన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు వెళ్లే ముందు, నేను కొంచెం ఒత్తిడిలో ఉన్నాను. కానీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినందుకు ఆనందంగా ఉంది" అని త్రిపాఠి పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఎస్‌ఆర్‌హెచ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత జట్టులో చూడాలనుకుంటున్నాం'
Comments
Please login to add a commentAdd a comment