
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో సనరైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్ ఆడాడు. విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శరక్మ విఫలమైన చోట.. త్రిపాఠి తన బ్యాట్‌కు పనిచెప్పాడు.
ఐదో వికెట్‌కు క్లాసెన్‌తో కలిసి 62 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్‌గా 35 బంతులు ఎదుర్కొన్న త్రిపాఠి 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 55 పరుగులు చేశాడు.
అయ్యో రాహుల్..
అయితే ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కన్పించిన త్రిపాఠిని దురదృష్టం వెంటాడింది. అనూహ్య రీతిలో త్రిపాఠి రనౌటయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన సునీల్ నరైన్ బౌలింగ్‌లో తొలి బంతిని సమద్ భారీ సిక్స్ మలిచాడు. అదే ఓవర్‌లో రెండో బంతిని సమద్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు.
పాయింట్‌లో ఉన్న రస్సెల్ అద్బుతంగా డైవ్ చేస్తూ బంతిని ఆపాడు. అయితే షాట్ ఆడిన వెంటనే సమద్ నాన్‌స్ట్రైక్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠితో ఎటువంటి సమన్వయం లేకుండా సింగిల్ కోసం ప్రయత్నించాడు. త్రిపాఠి మాత్రం బంతిని చూస్తూ మిడిల్ పిచ్‌లోనే ఉండిపోయాడు.
ఈ క్రమంలో రస్సెల్ బంతిని వికెట్ కీపర్ గుర్బాజ్ అందజేయగా.. అతడు స్టంప్స్‌ను గిరాటేశాడు. కాగా ఔటైన అనంతరం త్రిపాఠి భావోద్వేగానికి లోనయ్యాడు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో మెట్లపై కూర్చోని కన్నీరు పెట్టుకున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్యా మారన్ సైతం షాక్‌కు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Dre-Russ produces a piece of magic 🔥💜#IPLonJioCinema #TATAIPL #KKRvSRH #TATAIPLPlayoffs #AndreRussell pic.twitter.com/eaZRQNkes5
— JioCinema (@JioCinema) May 21, 2024