IPL Fans Want To The Rahul Tripathi To Play For India After IPL 2022 - Sakshi
Sakshi News home page

IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత జట్టులో చూడాలనుకుంటున్నాం'

Published Sat, Apr 16 2022 9:12 AM | Last Updated on Sat, Apr 16 2022 10:24 AM

Fans want Rahul Tripathi to play for India after IPL 2022 - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లో 71 పరుగులు సాధించి ఎస్‌ఆర్‌హెచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో నెటిజన్లు త్రిపాఠిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత్‌ తరపున ఆడేందుకు త్రిపాఠి అర్హుడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్‌-2022 సీజన్‌ ముగిశాక అతడికి భారత్‌ జట్టులో చోటు కల్పించాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు."త్రిపాఠి అద్భుతమైన క్రికెటర్‌. సెలెక్టర్లు అతడి ఆట తీరును పరిగణనలోకి తీసుకోవాలి. వీలైనంత త్వరగా అతడిని భారత జట్టులో చూడాలనుకుంటున్నాం" అని ఓ యాజర్‌ కామెంట్‌ చేశాడు. కాగా ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన  త్రిపాఠి.. 171 పరుగులు సాధించాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ సీజన్‌లో హ్యాట్రిక్‌ విజయం సాధించింది. కేకేఆర్‌పై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో ఆరోన్‌ ఫించ్‌ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement