
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా ఏప్రిల్ 11న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి గాయపడిన సంగతి తెలిసిందే. రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో తొలి బంతికే అద్భుతమైన సిక్స్ బాదిన త్రిపాఠి.. తరువాత తొడ కండరాలు పట్టేయడంతో అతడు ఫీల్డ్ నుంచి వైదొలగాడు. అయితే ఈ మ్యాచ్‌లో 11 బంతుల్లో 17 పరుగులు చేసి మంచి టచ్‌లో త్రిపాఠి కనిపించాడు.
ఈ క్రమంలో కేకేఆర్‌తో జరగబోయే ఎస్‌ఆర్‌హెచ్ తదుపరి మ్యాచ్‌కు త్రిపాఠి అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందేహం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ .. త్రిపాఠి గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. తమ తదపరి మ్యాచ్‌కు త్రిపాఠి కోలుకుంటాడని విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. "అదృష్టవశాత్తు త్రిపాఠికి పెద్ద గాయం కాలేదు. అతడు త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాను.
అతడు కేకేఆర్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడాని నేను భావిస్తున్నాను. మరోవైపు దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్‌కి కూడా గాయమైంది. అతడి గాయం తీవ్రమైనది కాబట్టి తదుపరి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడు దూరం కావడం మా జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ" అని విలియమ్సన్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: జోరు మీదున్న సన్‌రైజర్స్‌కు భారీ షాక్! కీలక ఆటగాడు దూరం!
Comments
Please login to add a commentAdd a comment