రాహుల్ త్రిపాఠి ఫైల్ ఫోటో
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలిపించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ హెన్రిస్ క్లాసెన్ 63 పరుగులతో విరోచిత పోరాటం చేసినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేసింది.
అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. త్రిపాఠి తన ఆట తీరుతో పరోక్షంగా ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణమయ్యాడు. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ మంచి అరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అగర్వాల్ ఔటయ్యాక క్రీజులోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు. క్రీజులోకి వచ్చినప్పటినుంచే ప్రత్యర్ధి బౌలర్లను ఎదుర్కోవడానికి రాహుల్ కష్టపడ్డాడు. ఓ వైపు కావాల్సిన రన్‌రేట్(రిక్వైడ్ రన్ రేట్) పెరుగుతూ ఉంటే త్రిపాఠి డిఫెన్స్ ఆడుతూ విసుగు తెప్పించాడు. టెస్టు కంటే దారుణంగా త్రిపాఠి ఇన్నింగ్స్ కొనసాగింది.
అతడు రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునప్పటికి తన ఇన్నింగ్స్‌ను మాత్రం ఎక్కువ సమయం కొనసాగించలేకపోయాడు. సరిగ్గా 20 బంతుల్లో 1 సిక్సర్‌తో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో అతడిపై ఎస్ఆర్‌హెచ్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టెస్టు మ్యాచ్‌లా ఆడి ఎస్ఆర్‌హెచ్ కొంపముంచాడని పోస్ట్‌లు పెడుతున్నారు.
Rahul Tripathi started the IPL 2024 from where left last season.
— TukTuk Academy (@TukTuk_Academy) March 23, 2024
Scored 20 off 20 in 209 runs chase at batting paradise Edens🥵🔥 #KKRvSRH pic.twitter.com/pXwjrLuHsA
Comments
Please login to add a commentAdd a comment