ICC announces Men's Player of the Month nominees for February 2023 - Sakshi
Sakshi News home page

ICC Player Of The Month February: రేసులో బ్రూక్‌తో పాటు ఎవరున్నారంటే..?

Published Tue, Mar 7 2023 1:59 PM | Last Updated on Tue, Mar 7 2023 3:02 PM

 ICC Mens Player Of February Month Nominees Revealed - Sakshi

ఫిబ్రవరి నెలకు గానూ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు నామినీస్‌ జాబితాను ఐసీసీ ఇవాళ (మార్చి 7) ప్రకటించింది. ఫిబ్రవరి మాసంలో న్యూజిలాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్‌ రైజింగ్‌ స్టార్‌ హ్యారీ బ్రూక్‌, బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023 తొలి రెండు టెస్ట్‌ల్లో ఆల్‌రౌం‍డ్‌ ప్రదర్శనతో ఇరగదీసిన టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా, జింబాబ్వే పర్యటనలో జరిగిన రెండు టెస్ట్‌ల్లో అదరగొట్టిన విండీస్‌ యువ స్పిన్నర్‌ గుడకేశ్‌ మోటీ ఐసీసీ మెన్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫిబ్రవరి మంత్‌ అవార్డు రేసులో ఉన్నారు.

బ్రూక్‌.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీలు, ఓ భారీ సెంచరీ బాదగా.. జడేజా తొలి రెండు టెస్ట్‌ల్లో రెండు ఫైఫర్లతో పాటు అతి విలువైన ఓ హాఫ్‌ సెంచరీ చేశాడు.  విండీస్‌ స్పిన్నర్‌ గుడకేశ్‌ మోటీ విషయానికొస్తే.. ఇండియన్‌ ఆరిజిన్‌ కలిగిన ఈ స్పిన్‌ బౌలర్‌ జింబాబ్వేతో జరిగిన రెండు టెస్ట్‌ల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement