ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. రూట్.. తన సహచరుడు హ్యారీ బ్రూక్‌ను కిందకు దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో బ్రూక్ నంబర్ వన్ స్థానంలో నిలువగా.. వారం తిరిగే లోపే రూట్ మళ్లీ అగ్రపీఠమెక్కాడు.
ప్రస్తుతం రూట్ ఖాతాలో 895 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రూట్.. బ్రూక్ కంటే 19 రేటింగ్ పాయింట్లు ఎక్కువ కలిగి ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన మూడో టెస్ట్‌లో రూట్ 32, 54 (రెండు ఇన్నింగ్స్‌ల్లో) పరుగులు చేయగా.. బ్రూక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు (0,1).
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 423 పరుగుల తేడాతో ఓడినప్పటికీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా విలియమ్సన్ ర్యాంకింగ్ మెరుగుపడనప్పటికీ, గణనీయంగా రేటింగ్ పాయింట్లు పెంచుకున్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో కేన్ మూడో స్థానంలో ఉన్నాడు. కేన్‌కు రూట్‌కు మధ్య కేవలం 28 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.
నంబర్ వన్ టీ20 బౌలర్ ఎవరంటే..?
తాజా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో అద్భుత గణాంకాలు (4-1-13-2) నమోదు చేయడంతో అకీల్ టాప్ ప్లేస్‌కు చేరాడు. అకీల్ మూడు స్థానాలు ఎగబాకి చాలాకాలంగా టాప్ ప్లేస్‌లో ఉన్న ఆదిల్ రషీద్‌కు కిందకు దించాడు.
Comments
Please login to add a commentAdd a comment