ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ధీటుగా జవాబిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 492 పరుగులు చేసింది.
పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 64 పరుగులే వెనుకపడి ఉంది. జో రూట్ (176), హ్యారీ బ్రూక్ (141) అజేయ శతకాలతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) కూడా అర్ద సెంచరీలతో మెరువగా.. ఓలీ పోప్ డకౌటయ్యాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, నసీం షా, ఆమెర్ జమాల్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.
What happened there?! 😲
Brook is rendered lucky 🏏#PAKvENG | #TestAtHome pic.twitter.com/qk5dzRKEYn— Pakistan Cricket (@TheRealPCB) October 9, 2024
లక్కీ బ్రూక్
ఈ మ్యాచ్‌లో బ్రూక్ 75 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆమెర్ జమాల్ బౌలింగ్‌లో బ్రూక్ ఆడిన డిఫెన్సివ్ షాట్ వికెట్లకు తాకినప్పటికీ బెయిల్స్ కింద పడలేదు. దీంతో బ్రూక్ బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. అభిమానులు లక్కీ బ్రూక్ అని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో బ్రూక్ ఆరో టెస్ట్ సెంచరీని, రూట్ 35వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment