వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విధ్వంసర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 7 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 31 పరుగులు చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్ విజయానికి ఆండ్రీ రస్సెల్ వేసిన ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు అవసరమయ్యాయి. అయితే పెద్దగా ఫామ్‌లో లేని బ్రూక్ స్ట్రైక్‌లో ఉండడంతో విండీస్ విజయం లాంఛనమే అంతా అనుకున్నారు.
కానీ అందరి అంచనాలను బ్రూక్ తలకిందులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో మూడు సిక్స్‌లు, ఓ ఫోర్ బాది ఇంగ్లండ్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
బ్రూక్‌తో పాటు ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆజేయశతకంతో చెలరేగాడు. 56 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 109 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా(51) హాఫ్ సెంచరీతో రాణించాడు. హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎస్‌ఆర్‌హెచ్ తప్పు చేసింది..!?
ఐపీఎల్-2023 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తరపున హ్యారీ బ్రూక్ ఆడాడు. గత సీజన్ వేలంలో రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ బ్రూక్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు హ్యారీని ఎస్‌ఆర్‌హెచ్ విడిచిపెట్టింది. ఈ క్రమంలో విండీస్‌పై బ్రూక్ ఇన్నింగ్స్ చూసిన అభిమానులు ఎస్‌ఆర్‌హెచ్ అతడిని వదిలి తప్పు చేసింది అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అతడికి మరోక ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు.
𝗧𝗵𝗲 𝗛𝗜𝗚𝗛𝗘𝗦𝗧 𝘀𝘂𝗰𝗰𝗲𝘀𝘀𝗳𝘂𝗹 𝗿𝘂𝗻 𝗰𝗵𝗮𝘀𝗲 𝗮𝗴𝗮𝗶𝗻𝘀𝘁 𝘁𝗵𝗲 𝗪𝗲𝘀𝘁 𝗜𝗻𝗱𝗶𝗲𝘀! 🏏
— Cricket on TNT Sports (@cricketontnt) December 16, 2023
Just watch this final over... Harry Brook take a bow! 👏#WIvENG pic.twitter.com/raErDRlvTZ
Comments
Please login to add a commentAdd a comment