ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌ షాక్‌.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం | Big Blow For Delhi Capitals, Harry Brook Unlikely For IPL 2024 - Sakshi
Sakshi News home page

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌ షాక్‌.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం

Published Wed, Mar 13 2024 1:32 PM | Last Updated on Wed, Mar 13 2024 3:07 PM

Big Blow For Delhi Capitals, Harry Brook unlikely for IPL 2024 - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆటగాడు, ఇంగ్లండ్‌ యువ క్రికెటర్‌ హ్యారీ బ్రూక్‌ ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌-2024 నుంచి బ్రూక్‌ తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే ఢిల్లీ ఫ్రాంచైజీకి బ్రూక్‌ తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

                       

కాగా టీమిండియాతో టెస్టు సిరీస్‌ నుంచి సైతం బ్రూక్‌  ఆఖరి నిమిషంలో తప్పుకున్నాడు. కాగా గతేడాది సీజన్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున బ్రూక్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌-2023 వేలంలో అతడిని ఎస్‌ఆర్‌హెచ్‌ ఏకంగా రూ.13.23 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది. కానీ ఎస్‌ఆర్‌హెచ్‌ నమ్మకాన్ని బ్రూక్‌ వమ్ము చేశాడు. 11 మ్యాచ్‌ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు.

దీంతో అతడిని ఐపీఎల్‌-2024కు ముందు ఆరెంజ్‌ ఆర్మీ విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన హ్యారీని రూ.4 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది.  అయితే ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ మాత్రం  ఈ ఏడాది సీజన్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడికి బీసీసీఐ క్లియరెన్స్‌ ఇచ్చేసింది.
చదవండి: Happy Birthday Siraj: బ్యాటర్‌ టూ బౌలర్‌.. తండ్రి మరణాన్ని సైతం తట్టుకుని! ఎంతో మందికి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement