క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా. అద్భుత బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ చిరస్థాయిగా నిలిచిపోయే ఓ ఘనత మాత్రం అన్నింటికంటే ప్రత్యేకం.
టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇంత వరకు 400(నాటౌట్) పరుగులు సాధించిన ఒకే ఒక్క బ్యాటర్ లారా. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా 2004లో లారా ఈ ఫీట్ నమోదు చేశాడు.
అదే విధంగా.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఏకంగా 501(నాటౌట్) రన్స్ స్కోరు చేసిన ఘనత కూడా లారాకే దక్కింది. ఈ రెండు రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి.
దూకుడైన ఆటగాళ్లు తక్కువే
ఈ నేపథ్యంలో బ్రియన్ లారాకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగుల మార్కు అందుకోగల బ్యాటర్ ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్ల పేర్లు చెప్పాడు లారా.
‘‘నేను క్రికెట్ ఆడే సమయంలో కనీసం మూడు వందల పరుగుల మార్కు దాటేందుకు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజమామ్ ఉల్ హక్, సనత్ జయసూర్య వంటి వాళ్లు ఎంతగానో ప్రయత్నించారు.
ఇక ఇప్పుడు అలాంటి దూకుడైన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. ఇంగ్లండ్ జట్టులో జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్ అగ్రెసివ్‌గా ఆడుతున్నారు.
వీరిద్దరికే ఆ సత్తా ఉంది
ఇక భారత జట్టులో..?!.. యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్‌ల పేర్లను చెప్పవచ్చు. వీరిద్దరు ఒక్కసారి క్రీజులో కుదురుకుని పరిస్థితులు గనుక అనుకూలిస్తే ఇలాంటి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టగలరు’’ అని బ్రియన్ లారా డైలీ మెయిల్‌తో వ్యాఖ్యానించాడు.
కాగా టీమిండియా భవిష్య కెప్టెన్‌గా పేరొందిన ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు టెస్టుల్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 128. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఖాతాలో మాత్రం ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి.
అరంగేట్రంలోనే ఈ లెఫ్టాండర్ 171 పరుగులు చేశాడు. అంతేకాదు ఇప్పటిదాకా మూడుసార్లు 150 ప్లస్ స్కోర్లు సాధించాడు.
చదవండి: WCL 2024: యువరాజ్ మళ్లీ ఫెయిల్.. యూసఫ్, ఇర్ఫాన్ మెరుపులు!
Comments
Please login to add a commentAdd a comment