
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇప్పటికే ఈ మెగా లీగ్ కోసం ఆయా జట్లు తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలపెట్టాయి.
ఆయా జట్లు తమ హాంగ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతున్నాయి. ఇక ఈ ఏడాది సీజన్‌లో సరికొత్తగా బరిలోకి దిగబోతున్న సర్‌రైజర్స్ హైదరాబాద్ సైతం ఉప్పల్ నెట్స్‌లో తీవ్రంగా చమటోడ్చోతుంది. ఆ జట్టు బ్యాటర్ హ్యారీ బ్రూక్ నెట్ ప్రాక్టీస్‌కు వీడియోను ఎస్‌ఆర్‌హెచ్ ట్విటర్‌లో షేర్ చేసింది. నెట్స్‌లో ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొన్న బ్రూక్.. భారీ సిక్స్‌లతో విరుచుపడ్డాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్-2023 మినీవేలంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్ల భారీ ధర వెచ్చించి మరి ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది.
కాగా బ్రూక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన సూపర్ ఫామ్‌ను ఐపీఎల్‌లో కూడా కొనసాగించాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఎస్‌ఆర్‌హెచ్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్2న ఉప్పల్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది.
చదవండి: SL vs NZ: క్లియర్‌గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి
𝗛𝗔MME𝗥𝗥𝗬NG 🔨#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/MKJGNYE13E
— SunRisers Hyderabad (@SunRisers) March 25, 2023
𝗛𝗔MME𝗥𝗥𝗬NG 🔨#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/MKJGNYE13E
— SunRisers Hyderabad (@SunRisers) March 25, 2023