
హార్దిక్ పాండ్యా వన్డే అరంగేట్రం
ధర్మశాల: న్యూజిలాండ్తో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా హార్దిక్ పాండ్యా వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. తొలి వన్డేకు సురేష్ రైనా ఎంపికైనా వైరల్ ఫీవర్ కారణంగా దూరం కావడంతో హార్దిక్ పాండ్యాను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే టీ 20ల్లో ఆడిన అనుభవం ఉన్న హార్దిక్ కు వన్డేల్లో తొలిసారి అవకాశం కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీలకు విశ్రాంతినిచ్చింది. ధర్మశాల పిచ్ స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించే అవకాశం లేకపోవడంతో టాస్ గెలిచిన భారత్ మొదటి ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత తుది జట్టు ఇదే: ఎంఎస్ ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లి, మనీష్ పాండే, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్, జస్ప్రిత్ బూమ్రా
న్యూజిలాండ్ తుది జట్టు:కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, టామ్ లాధమ్, రాస్ టేలర్, కోరీ అండర్సన్, ల్యూక్ రోంచీ, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నార్, టిమ్ సౌతీ, బ్రాస్ వెల్, ఇష్ సోథీ