
కివీస్ తడ'బ్యాటు!
ధర్మశాల:ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఆదివారం న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా ఆరంభంలోనే ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ గప్టిల్(12)ను ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే పెవిలియన్ కు పంపి భారత్ కు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ను ఉమేష్ యాదవ్ వేయగా, రెండో ఓవర్ ను హార్దిక్ పాండ్యా వేశాడు.
ఈ క్రమంలోనే పాండ్యా తన వ్యక్తిగత తొలి ఓవర్ చివరి బంతికి గప్టిల్ ను అవుట్ చేశాడు. హార్దిక్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కు వేసిన ఆ బంతిని గప్టిల్ బ్యాట్ ను తాకి స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ చేతిలో పడింది. ఆ తరువాత కెప్టెన్ విలియమ్సన్(3), రాస్ టేలర్(0)లను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. దాంతో న్యూజిలాండ్ ఏడు ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 35 పరుగులు చేసి తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తోంది.