
హఫీజ్ ఆల్‌రౌండ్ షో
తొలి వన్డేలో శ్రీలంకపై పాక్ విజయం
దంబుల్లా: మొహమ్మద్ హఫీజ్ శతకం (95 బంతుల్లో 103; 10 ఫోర్లు; 4 సిక్సర్లు)తో పాటు బౌలింగ్‌లోనూ నాలుగు వికెట్లు తీయడంతో శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శనివారం రణ్‌గిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 255 పరుగులు చేసింది. చండిమాల్ (68 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. అనంతరం పాక్ 45.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 259 పరుగులు చేసి గెలిచింది. షోయబ్ మాలిక్ (45 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. హ ఫీజ్‌కు కెరీర్‌లో ఇది పదో సెంచరీ. ఈనెల 15న ఇరు జట్ల మధ్య పల్లెకెలెలో రెండో వన్డే జరుగుతుంది.