ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో మాత్రం అన్ని విధాల చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ నిర్ధేశించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని.. ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(51), మిచెల్ మార్ష్(66) అర్ధశతకాలతో విజృంభించి మ్యాచ్‌ను 11 ఓవర్లలోనే ముగించారు.
భారత బ్యాటర్ల దారుణ ప్రదర్శన..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. ఆసీస్ పేసర్ల దాటికి టీమిండియా బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు బ్యాటర్లు విలవిల్లాడారు. తొలి ఓవర్‌లోనే శుబ్‌మన్ గిల్ వికెట్‌ను కోల్పోయిన టీమిండియా.. అనంతరం ఏ దశలోనూ ఆసీస్ బౌలర్లను ఎదుర్కోలేకపోయింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి 31 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అయ్యర్ ఉంటే బాగుండేది..
ఇక ఘోర ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్ ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మిడిలార్డర్‌లో అయ్యర్ అద్భుతమైన ఆటగాడని, అతడు ఉండి ఉంటే టీమిండియాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోతున్నారు. ఈ క్రమంలో # శ్రేయస్ అయ్యర్ అనే ట్యాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
కాగా ఈ సిరీస్‌కు వెన్ను గాయం కారణంగా అయ్యర్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే అయ్యర్ గత కొంత కాలంగా భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా మిడిలార్డర్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఆసీస్‌తో రెండో వన్డేలో అయ్యర్ లేని లోటు స్పష్టంగా కన్పించింది.
చదవండి: IND vs AUS: మా ఓటమికి ప్రధాన కారణమిదే.. అస్సలు ఊహించలేదు! వారిద్దరూ అద్భుతం
Comments
Please login to add a commentAdd a comment