వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. వెన్ను గాయంతో బాధపడుతున్న భారత స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అయితే అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా అతడి గాయం తిరిగి పెట్టింది.
దీంతో అతడు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు కూడా రాలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్డు ప్రకారం.. అయ్యర్ తన గాయానికి లండన్‌లో సర్జరీ చేయించుకోనున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఫైనల్‌కు కూడా దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ముంబైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి.. అక్కడి వైద్యులు సర్జరీ అవసరమని సూచించినట్లు సమాచారం. సర్జరీ చేయించుకున్నాక అతడు కనీసం ఐదు నెలలపాటు ఆటకు దూరం కానున్నాడు. అయ్యర్ మళ్లీ ఆక్టోబర్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక జూన్7 నుంచి లండన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది.
చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లికి ఊహించని షాక్! అయితే ధోని మాదిరి..
Comments
Please login to add a commentAdd a comment