విరాట్‌ అవుట్‌.. స్టేడియంలో సైలెన్స్ | entire stadium silence after virat kohli got out at 8 runs | Sakshi
Sakshi News home page

విరాట్‌ అవుట్‌.. స్టేడియంలో సైలెన్స్

Published Thu, Jan 19 2017 2:07 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

విరాట్‌ అవుట్‌.. స్టేడియంలో సైలెన్స్

విరాట్‌ అవుట్‌.. స్టేడియంలో సైలెన్స్

కటక్‌: ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో టీమిండియాకు ఆరంభంలో ఎదురు దెబ్బ తగిలింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌ కోహ్లీ సేన వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌ బౌలర్ వోక్స్ ఒకే ఓవర్లో ఓపెనర్ లోకేష్‌ రాహుల్‌, కెప్టెన్ విరాట్‌ కోహ్లీని అవుట్ చేశాడు. రాహుల్‌, కోహ్లీ ఇద్దరూ స్టోక్స్కు క్యాచిచ్చారు.

తొలి వన్డేలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన కోహ్లీ.. ఈ మ్యాచ్లో ఎనిమిది పరుగులకే అవుటయ్యే సరికి అభిమానులు నిరాశ చెందారు. స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. వోక్స్ తన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్‌ శిఖర్ ధవన్‌ను కూడా పెవిలియన్‌ను చేర్చి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. ధవన్‌ బౌల్డయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement