మళ్లీ కెప్టెన్గా మోర్గాన్ | Eoin Morgan Returns to Captain England's ODI Team vs India | Sakshi
Sakshi News home page

మళ్లీ కెప్టెన్గా మోర్గాన్

Published Tue, Dec 6 2016 1:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

మళ్లీ కెప్టెన్గా మోర్గాన్

మళ్లీ కెప్టెన్గా మోర్గాన్

ముంబై: ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు నుంచి తప్పుకున్న ఇయాన్ మోర్గాన్ తిరిగి జట్టులో జాయిన్ కానున్నాడు. భారత్తో జరుగనున్న మూడు వన్డేల సిరీస్కు మోర్గాన్ ను తిరిగి జట్టులో ఎంపిక చేశారు. దాంతోపాటు ఇంగ్లండ్ వన్డే జట్టు, టీ 20 కెప్టెన్గా మోర్గాన్ పేరును ఖరారు చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.

బంగ్లాదేశ్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన మోర్గాన్ ఆ పర్యటనకు దూరంగా ఉన్నాడు. దాంతో ఇంగ్లండ్ వన్డే కెప్టెన్సీ బాధ్యతలను జాస్ బట్లర్కు అప్పగించాల్సి వచ్చింది. ప్రస్తుతం మోర్గాన్ జట్టుకు అందుబాటులోకి రావడంతో అతనే వన్డే,టీ 20 కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. బట్లర్తో పాటు అలెక్స్ హేల్స్లు వన్డే, టీ 20 జట్టులో కలవనున్నారు. మరొకవైపు బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే జట్టు నుంచి విశ్రాంతినిచ్చిన జో రూట్ ను  భారత్ తో వన్డే సిరీస్ కు ఎంపిక చేశారు.ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ టెస్టు జట్టులో రూట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్ వన్డే జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్ స్టో, జాక్ బాల్, సామ్ బిల్లింగ్స్, జాస్ బట్లర్, డావసన్, హేల్స్, ప్లంకెట్, అదిల్ రషిద్, జో రూట్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement