Morgan
-
SA Vs ENG : ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం.. అయినా సెమిస్కు..
ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం.. అయినా సెమిస్కు.. చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమైంది. అఖరి ఓవర్లో 14 పరుగుల కావల్సిన నేపథ్యంలో కగిసో రబడా హ్యట్రిక్ వికెట్లతో మెరిశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఆలీ(37), మలాన్(33),లివింగ్‌స్టోన్(27) టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించినప్పటికీ సెమిస్కు ఆర్హత సాధించలేక పోయింది. కాగా అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వాన్ డెర్ డస్సెన్, మారక్రమ్ ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో రెండు వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. వాన్ డెర్ డస్సెన్, మారక్రమ్ కలిసి 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వాన్ డెర్ డస్సెన్(90),మారక్రమ్(50), డికాక్(34), పరుగులు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలలో మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. మలాన్(33) ఔట్ 146 పరుగుల వద్ద మలాన్(33) రూపంలో ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లియామ్ లివింగ్‌స్టోన్(27), మోర్గాన్(5) పరుగులతో క్రీజులో పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బెయిర్‌స్టో(1) ఔట్ 59 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. తబ్రైజ్ షమ్సీ బౌలింగ్‌లో బెయిర్‌స్టో ఎల్బీగా వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో ఆలీ(31), మలాన్(20) పరుగులతో ఉన్నారు. కాగా జాసన్ రాయ్ రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బట్లర్(26) ఔట్ సమయం: 21:59.58 పరుగుల వద్ద బట్లర్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 26 పరుగులు చేసిన బట్లర్, నోర్ట్జే బౌలింగ్‌లో బావుమాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో ఆలీ(8), బెయిర్‌స్టో(1) పరుగులతో ఉన్నారు. కాగా జాసన్ రాయ్ రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. చేలరేగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ 190 పరుగులు ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌లో వాన్ డెర్ డస్సెన్, మారక్రమ్ ఆర్ధసెంచరీలతో చేలరేగడంతో రెండు వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. వాన్ డెర్ డస్సెన్, మారక్రమ్ కలిసి 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో వాన్ డెర్ డస్సెన్(90),మారక్రమ్(50), డికాక్(34), పరుగులు సాధించారు. ఇంగ్లండ్ బౌలర్లలలో మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు. 130 పరుగులలోపు ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేస్తే దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరుతుంది. 15 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 118/2 ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేలరేగి ఆడుతుంది. 15 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజులో వాన్ డెర్ డస్సెన్(61), మారక్రమ్(15) పరుగులతో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా.. 6 ఓవర్లకు 49/1 సమయం: 19:59.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిలకడగా ఆడుతుంది. 6 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డి కాక్(22), వాన్ డెర్ డస్సెన్(23) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. హెండ్రిక్స్(2) ఔట్ సమయం: 19:45 ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హెండ్రిక్స్ రూపంలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన హెండ్రిక్స్ మోయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 3 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో క్వింటన్ డి కాక్(11), వాన్ డెర్ డస్సెన్(1) పరుగులతో ఉన్నారు. షార్జా: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా శనివారం(నవంబర్6) దక్షిణాఫ్రికా కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే నవంబర్6న జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి సెమిస్కు అడుగు దూరంలో నిలిచింది. దీంతో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా భారీ విజయం సాధిస్తే మెరుగైన రన్ రేట్‌తో సెమిస్కు చేరే అవకాశం ఉంటుంది. ఇక ఇరుజట్లు టీ20 ప్రపంచకప్‌లో ముఖాముఖి ఆరు సార్లు తలపడగా, దక్షిణాఫ్రికా 3 సార్లు గెలుపొందగా, 2 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఎటువంటి ఫలితం తేలలేదు. ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్‌కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడా, కేశవ్ మహారాజ్, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ చదవండి: SA Vs ENG : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. -
T20 WC 2021 ENG Vs WI: 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం
6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం వెస్టిండీస్‌పై విజయం సాధించి టి20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్ తొలి అడుగు వేసింది. 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. ఇంగ్లండ్ జట్టులో బట్లర్ 24 పరుగులతో నటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. విండీస్ బౌలర్లలో అకేల్ హోసిన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు టాస్ ఓడి భ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే కూప్ప కూలిపోయింది. విండీస్ బ్యాటింగ్‌లో ఒక్క క్రిస్ గేల్ తప్ప ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ స్కోర్ ధాట లేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టగా, టైమల్ మిల్స్ ,మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు , క్రిస్ వోక్స్, జోర్డాన్ చెరో వికెట్ సాధించారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. బెయిర్‌స్టో(9) ఔట్ 56 పరుగల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. రవి రంపాల్ బౌలింగ్‌లో జాసన్ రాయ్(11) క్రిస్ గేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరగా, అకేల్ హోసిన్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 34 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్(11), మొయిన్ అలీ(3) పరగులతో క్రీజులో ఉన్నారు. కూప్పకూలిన వెస్టిండీస్.. 55 పరగులకే ఆలౌట్ టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 55 పరుగులకే ఆలౌటై వెస్టిండీస్ ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కరీబీయన్లు ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి విలవిల్లడారు. 14.2 ఓవర్లలో 55 పరుగులకే వెస్టిండీస్ కూప్ప కూలిపోయింది. విండీస్ బ్యాటింగ్‌లో ఒక్క క్రిస్ గేల్ తప్ప ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ స్కోర్ ధాట లేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టగా, టైమల్ మిల్స్ ,మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు , క్రిస్ వోక్స్, జోర్డాన్ చెరో వికెట్ సాధించారు. పీకల్లోతు కష్టాల్లో విండీస్..42 పరుగులకే 6 వికెట్లు ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ బ్యాటర్లు విలవిలాడుతున్నారు. కేవలం 42 పరుగలుకే 6 వికెట్లు కోల్పోయి విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. వరుస క్రమంలో బ్రావో (5), పూరన్(1) వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి వెస్టిండీస్ 44 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పొలార్డ్(4),రసెల్(0)పరుగులుతో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ ,మొయిన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, క్రిస్ వోక్స్, జోర్డాన్ చెరో వికెట్ సాధించారు. 33 పరుగులకే 4 వికెట్లు డౌన్.. కష్టాల్లో వెస్టిండీస్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 35 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ కష్టాల్లో పడింది. వరుస క్రమంలో హెట్‌మైర్(9) ,క్రిస్ గేల్(13) వికెట్లను విండీస్ కోల్పోయింది. మొయిన్ అలీ బౌలింగ్‌లో హెట్‌మైర్ పెవిలియన్‌కు చేరగా, టైమల్ మిల్స్ బౌలింగ్‌లో క్రిస్ గేల్ మలాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 7 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి వెస్టిండీస్ 33 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. సిమన్స్(3) ఔట్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్ కోల్పోయింది. మొయిన్ అలీ బౌలింగ్‌లో సిమన్స్(3) పరుగులకే లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.4 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి వెస్టిండీస్ 19 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.. లూయిస్(6) ఔట్ టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. లూయిస్(6) పరుగులకే క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మొయిన్ అలీకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ సష్టానికి వెస్టిండీస్ 9 పరుగలు చేసింది. ప్రస్తుతం క్రీజులో లెండిల్ సిమన్స్(3), క్రిస్ గేల్(0) పరుగులుతో ఉన్నారు. దుబాయ్: టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా నేటి నుంచి సూపర్ 12 దశ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. రెండో మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లండ్, వెస్టిండీస్‌లు తల పడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక టి20 ల్లో ఇరు జట్లు 18 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. 11 మ్యాచ్‌లు కరీబీయన్లు నెగ్గగా.. కేవలం ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఇంగ్లండ్ గెలిచింది. రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. కానీ రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోను ఓటమి చెంది విండీస్ కాస్త ఢీలా పడింది. ఇక ఇంగ్లండ్ విషయంకు వస్తే.. బట్లర్, రాయ్, మలన్, బెయిర్ స్టో లాంటి విధ్వంసక బ్యాటర్లు ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. 2016లో టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై కార్లోస్ బ్రాత్‌వైట్ ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి వెస్టిండీస్‌ని గెలిపించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, జోర్డాన్, రషీద్, , టైమల్ మిల్స్ వెస్టిండీస్: ఎవిన్ లూయిస్, లెండిల్ సిమన్స్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, హెట్మెయర్, పొలార్డ్, రసెల్, బ్రావో, అకేల్ హోసిన్, మెక్కాయ్, రవి రంపాల్ చదవండి: 2007 టి20 వరల్డ్‌కప్ ఫైనల్ గుర్తుందిగా.. తాజాగా ముగ్గురు మాత్రమే -
టీమిండియా ఆటగాళ్లకు ఆ కోరిక ఎక్కువే: మోర్గాన్
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ లీగ్‌లు జరిగినా, వాటిల్లో పాల్గొనేందుకు టీమిండియా ఆటగాళ్లు ఎక్కువగా ఇష్టపడతారని ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారథి ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌లో నిర్వహించే 'ది హండ్రెడ్' బాల్ క్రికెట్ లీగ్‌లో పాల్గొనాలని చాలా మంది భారత క్రికెటర్లు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఓ క్రీడా ఛానెల్లో నిర్వహించిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా టీమిండియా క్రికెటర్లు కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు చాలా ఇష్టపడతారని, అక్కడి సంప్రదాయాలు తెలుసుకునేందుకు వారు ఎక్కువగా ఆసక్తి చూపుతారని అన్నారు. టీమిండియా క్రికెటర్లు ఆడితే ఆయా లీగ్‌లకు అదనపు ఆకర్షణ వస్తుందని, దాంతో వ్యాపారం కూడా బాగా పెరుగుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే, కొన్ని లీగ్‌ల వల్ల్ల ఆయా దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ క్రికెట్ టోర్నీల కారణంగా కొన్ని దేశాలు అత్యుత్తమ జట్లను బరిలోకి దింపలేకపోతున్నాయని పేర్కొన్నాడు. దీనిపై ఐసీసీ దృష్టిసారించాలని ఆయన కోరాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు క్రికెట్ ఫార్మాట్ల మధ్య పెద్ద తేడా లేకుండా పోయిందని, దేనికి దక్కాల్సిన ప్రాధాన్యత దానికి దక్కడం లేదని ఆయన వాపోయాడు. అయితే, టీ20 క్రికెట్ యువ క్రికెటర్లకు బాగా ఉపయోగపడుతుందని, వారి కెరీర్ బిల్డప్ చేసుకునేందుకు ఈ ఫార్మాట్ బాగా ఉపయోగపడుతుందని తెలిపాడు. వన్డే, టెస్ట్ ఫార్మాట్ల పరిస్థితి ఇందుకు భిన్నమని.. ఈ ఫార్మాట్లలో ఆడటాన్ని ప్రధాన క్రికెటర్లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా, వంద బంతుల క్రికెట్ లీగ్‌ను(ది హండ్రెడ్ లీగ్) ఇంగ్లాండ్ గతేడాదే నిర్వహించాలని భావించింది. కరోనా కారణంగా అది సాధ్యపడకపోవడంతో ఈ ఏడాది నిర్వహించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) భావిస్తోంది. చదవండి: వైరల్ వీడియో: నేటి ధోని, నాటి ధోనితో ఏమన్నాడంటే.. -
ముగ్గురు కెప్టెన్లకు గాయాలు.. ఆందోళనలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు
పూణే: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఏకంగా నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్, ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్ లాంటి కీలక ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసే సమయంలో గాయపడటంతో తర్వాతి వన్డేకి అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. జట్టు విజయావకాశాలను ప్రభావితం చేయగల నలుగురు ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో గాయపడటంతో ఇరు జట్లు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉండగా ఆటగాళ్ల గాయాల విషయం ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో సైతం గుబులు రేపుతోంది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు కీలక ఆటగాళ్లు వరుసపెట్టి గాయాలబారిన పడటంపై ఆయా ఫ్రాంచైజీలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. గాయాలపాలైన ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీలకు చెందిన కెప్టెన్లు కావడం.. ఆయా ఫ్రాంచైజీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌కు రోహిత్, గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయస్ అయ్యర్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇయాన్ మోర్గాన్ సారధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే టీమిండియాతో టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ మోచేతి గాయం కారణంగా వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లోని తొలి భాగం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్‌లో ఇరు జట్లలోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ జట్లలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. దీంతో ఇరు జట్ల మధ్య జరుగబోయే తదుపరి రెండు వన్డేల్లో ఎవరూ గాయపడకూడదని ఫ్రాంఛైజీలు కోరుకుంటున్నాయి. కాగా, ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లందరూ తమ జట్లు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశించాలంటే వారం రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంది. ఏప్రిల్ 9న ప్రారంభంకాబోయే తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చదవండి: ఇంగ్లండ్‌కు షాక్.. రెండో వన్డేకు ఇద్దరు ఆటగాళ్లు దూరం..! చదవండి: టీమిండియాకు షాక్.. కీలక ఆటగాడు దూరం! -
ఇంగ్లండ్‌కు షాక్.. రెండో వన్డేకు ఇద్దరు ఆటగాళ్లు దూరం..!
పూణే: తొలి వన్డేలో టీమిండియా చేతిలో 66 పరుగుల తేడాతో ఘోరపరాభవాన్ని ఎదుర్కొన్న ఇంగ్లీష్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండో వన్డేకు ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, స్టార్ బ్యాట్స్‌మెన్ సామ్ బిల్లింగ్స్ దూరంకానున్నారని తెలుస్తోంది. పూణే వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు గాయపడ్డారు. మోర్గాన్‌కు కుడి చేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్య గాయం కావడంతో నాలుగు కుట్లు కూడా వేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. మరోవైపు బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలో బిల్లింగ్స్ భుజం పైభాగం(కాలర్‌బోన్)కు గాయమైంది. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించాలని ఇంగ్లండ్ జట్టు మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఇదే జరిగితే రెండో వన్డేలో ఇంగ్లండ్ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. అసలే నిలకడలేమితో సతమతమవుతున్న ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలినట్లైంది. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఇదే వేదికగా శుక్రవారం(మార్చి 26) రెండో వన్డే జరుగనుంది. ప్రస్తుతం సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: టీమిండియాకు షాక్.. కీలక ఆటగాడు దూరం! -
పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్
భారత గడ్డపై ఇంగ్లండ్ జట్టు పర్యటన మూడో దశకు చేరింది. తొలి టెస్టులో ఓడిన తర్వాత వరుస విజయాలతో సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా... హోరాహోరీగా సాగిన టి20ల్లోనూ ముందు వెనుకబడ్డా ఆ తర్వాత చెలరేగి విజేతగా నిలిచింది. ఇక వరల్డ్ చాంపియన్‌తో వన్డే సమరంలోనూ గెలిస్తే విజయం సంపూర్ణమవుతుంది. మరోవైపు ఈ ఫార్మాట్లోనైనా సిరీస్ అందుకొని గౌరవంగా స్వదేశం వెళ్లాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్, టి20 ప్రపంచకప్ కారణంగా ఈ ఏడాది వన్డేలకు అంత ప్రాధాన్యత కనిపించకపోయినా... రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. పుణే: స్ఫూర్తిదాయక ప్రదర్శనతో టి20 సిరీస్‌ను గెలుచుకున్న మూడు రోజుల విరామం తర్వాత మరో వేదికపై భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. వరుసగా రెండు టెస్టులు, ఐదు టి20ల తర్వాత మ్యాచ్‌లు జరిగే వేదిక మారినా... కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్ నిర్వహించనున్నారు. 2016–17లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2–1తో గెలుచుకుంది. ధావన్‌కు మరో అవకాశం! టి20 సిరీస్ ఆడిన భారత జట్టే దాదాపుగా వన్డేల్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టి20లో విఫలమై ఆ తర్వాత బెంచీకే పరిమితమైన శిఖర్ ధావన్ వన్డేలో ఓపెనర్‌గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఎప్పటిలాగే రోహిత్‌తో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడని కెప్టెన్ ఇప్పటికే ప్రకటించాడు. చివరి టి20కు దూరమైన కేఎల్ రాహుల్‌కు కూడా మరో చాన్స్ లభించవచ్చు. అయితే అది మిడిలార్డర్లోనే. సూర్యకుమార్ లాంటి కొత్త ఆటగాళ్ల నుంచి తీవ్రంగా పోటీ ఉన్న నేపథ్యంలో తన స్థానం నిలబెట్టుకోవాలంటే రాహుల్ సత్తా చాటాల్సిందే. తనకే సొంతమైన మూడో స్థానంలో ఆడే కోహ్లి, అయ్యర్ తర్వాత రాహుల్ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. మ్యాచ్ సాగే సమయంలో వ్యూహం మారితే అతనికంటే ముందు పంత్ బ్యాటింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఖాయం కాగా... ముగ్గురు పేసర్లుగా భువనేశ్వర్, శార్దుల్ ఠాకూర్, నటరాజన్ సిద్ధంగా ఉన్నారు. కొత్తగా ఎంపికైన ప్రసిధ్ కృష్ణకు తొలి మ్యాచ్‌లోనే అవకాశం రాకపోవచ్చు. స్పిన్నర్లలో చహల్, కుల్దీప్లలో ఒక్కరే బరిలోకి దిగుతారు. రెండో స్పిన్నర్‌గా సుందర్‌ను ఆడించాలని భావిస్తే శార్దుల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. లివింగ్‌స్టోన్‌కు చాన్స్! వన్డేల్లో రెగ్యులర్ ఆటగాళ్లు రూట్, వోక్స్‌లకు సిరీస్ నుంచి ఇంగ్లండ్ విశ్రాంతినివ్వగా... ఆర్చర్ గాయంతో వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కవచ్చు. ఇటీవల ఇంగ్లండ్ దేశవాళీ వన్డేల్లో ఆకట్టుకున్న లివింగ్‌స్టోన్ తన అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. లెగ్‌స్పిన్నర్ పార్కిన్సన్ కూడా అవకాశాన్ని ఆశిస్తుండగా, రషీద్‌ను పక్కన పెట్టి ఇంగ్లండ్ ఆ మార్పు చేయగలదా అనేది చూడాలి. ఓపెనర్లుగా రాయ్, బెయిర్‌స్టో బరిలోకి దిగనుండగా, కీపర్ బట్లర్ మిడిలార్డర్లో ఆడతాడు. టి20ల్లో ఆకట్టుకోని కెప్టెన్ మోర్గాన్ తనకు అచ్చొచ్చిన ఫార్మాట్లో చెలరేగాల్సి ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వన్డేల్లోనూ మ్యాచ్‌ను శాసించగలడు. లార్డ్స్‌లో జరిగిన చిరస్మరణీయ 2019 వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత అతను ఆడనున్న తొలి వన్డే ఇదే కావడం విశేషం. పేసర్ మార్క్ వుడ్ మరోసారి తన వేగాన్ని నమ్ముకోగా, టాప్లీ కొత్త బంతిని పంచుకుంటాడు. మూడో పేసర్‌గా అన్నదమ్ములు స్యామ్, టామ్ కరన్‌ల మధ్య పోటీ ఉంది. పిచ్, వాతావరణం మొదటి నుంచి పుణే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ నాలుగు వన్డేలు జరగ్గా మూడుసార్లు 300కుపైగా స్కోర్లు నమోదయ్యాయి. వర్షం సమస్య లేదు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, అయ్యర్, పంత్, రాహుల్, హార్దిక్, భువనేశ్వర్, శార్దుల్, చహల్/కుల్దీప్, నటరాజన్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, బిల్లింగ్స్, లివింగ్‌స్టోన్, స్యామ్/టామ్ కరన్, రషీద్, టాప్లీ, వుడ్. చిన్నారితో... భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిసారి తన రెండు నెలల పాపతో కలిసి మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చాడు. పుణే విమానాశ్రయంలో భార్య అనుష్క, కూతురు వామికాతో కలిసి ఉన్న చిత్రాలు ప్రధాన ఆకర్షణగా మారాయి. అనుష్క చేతుల్లో అమ్మాయి ఉండగా... కోహ్లి చేతుల్లో మొత్తం లగేజీ కనిపించడం కూడా సోషల్ మీడియాలో ‘మీమ్’లకు పని పెట్టాయి! -
టీమిండియా నిలిచేనా!
టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం... ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించడం... భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మూడు టి20ల్లో ఇదే దృశ్యం కనిపించడం చూస్తే టాస్ ఎంత కీలకంగా మారిందో అర్థమవుతుంది. అయితే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని టాస్‌తో సంబంధం లేకుండా దేనికైనా సిద్ధంగా ఉండాలని భారత టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్‌ను నిలువరించి కోహ్లి జట్టు సిరీస్ ను ఎలా కాపాడుకుంటుందనేది ఆసక్తికరం. అహ్మదాబాద్: టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌లో కొంత తడబడుతున్న భారత జట్టు సిరీస్ చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. రెండో మ్యాచ్‌లో సునాయాస విజయం తర్వాత మరో సారి పేస్ బౌలింగ్‌కు తలవంచి గత మ్యాచ్‌లో ఓడిన జట్టు తర్వాతి పోరుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే నాలుగో టి20లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇప్పటికే 2–1తో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ వశం చేసుకుంటుంది. రాహుల్‌కు చాన్స్ ఉందా! భారత తుది జట్టుకు సంబంధించి చర్చ రేపుతున్న ఒకే ఒక్క అంశం కేఎల్ రాహుల్ ఫామ్. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో అతను 1, 0, 0 స్కోర్లకే అవుటయ్యాడు. అయితే గత మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అతడికి మద్దతుగా నిలిచారు. వారి మాటలను బట్టి చూస్తే రాహుల్‌కు మరో అవకాశం దక్కవచ్చు. కానీ కోహ్లి సాధారణంగా చేసే వ్యాఖ్యలకు భిన్నంగా మ్యాచ్ రోజు వ్యూహాలు ఉంటాయి. కాబట్టి కచ్చితంగా రాహుల్‌ను ఆడిస్తారని చెప్పలేం. అరంగేట్ర మ్యాచ్‌లో బ్యాటింగ్ కూడా రాకుండా గత పోరులో పక్కన పెట్టిన సూర్యకుమార్ యాదవ్‌ను రాహుల్ స్థానంలో తీసుకొని ఇషాన్ కిషన్‌తోనే ఓపెనింగ్ చేయించాలనే ప్రత్యామ్నాయం భారత్ ముందుంది. కోహ్లి ఫామ్‌లోకి రావడం భారత్‌కు సానుకూలాంశం కాగా, రోహిత్ కూడా చెలరేగితే తిరుగుండదు. కిషన్, పంత్, అయ్యర్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. హార్దిక్ కూడా లయ అందుకుంటే జట్టు విజయావకాశాలు మెరుగుపడతాయి. బౌలింగ్‌లో భువనేశ్వర్, సుందర్ పొదుపు పాటిస్తుండగా... చహల్ మాత్రమే తీవ్రంగా నిరాశపరుస్తున్నా డు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ చహల్‌పై ఎదురుదాడి చేసి ఫలితం రాబట్టారు. శార్దుల్‌కు బదులుగా దీపక్ చహర్‌ను ఆడించాలని కూడా జట్టు భావిస్తోంది. బలమైన బ్యాటింగ్... గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ బ్యాటింగ్ పదును చూపించింది. రాయ్, మలాన్ విఫలమైనా... బట్లర్ ప్రదర్శించిన దూకుడుతో జట్టుకు సునాయాస విజయం దక్కింది. ఐపీఎల్ అనుభవంతో, ముఖ్యంగా స్పిన్‌ను అతను సమర్థంగా ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు అదనపు బలంగా మారింది. టెస్టుల్లో ఘోరంగా విఫలమైన బెయిర్‌స్టో కూడా టి20ల్లో రాణిస్తున్నాడు. ఆపై మోర్గాన్, స్టోక్స్ కూడా ధాటిగా ఆడగల సమర్థులు కాబట్టి వారిని నిలువరించడం భారత్‌కు అంత సులువు కాదు. అన్నింటికి మంచి మార్క్ వుడ్ తన ఫాస్ట్ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ తీస్తున్నాడు. ఆర్చర్ కూడా అంతే వేగంతో అతనికి సహకారం అందించాడు. వీరిద్దరు మరోసారి చెలరేగితే టీమిండియాకు కష్టాలు తప్పవు. స్పిన్నర్ రషీద్‌ను కూడా సమర్థంగా ఎదుర్కోవడంలో భారత్ విఫలమవుతోంది. అన్ని రంగాల్లో ఒకింత మనకంటే మెరుగ్గానే కనిపిస్తున్న ఇంగ్లండ్ సిరీస్ విజయంపై కన్నేసింది. కోహ్లి ర్యాంక్ 5 ఐసీసీ టి20 బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి మరోసారి టాప్–5లోకి అడుగు పెట్టాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో వరుసగా రెండు అర్ధ సెంచరీలు సాధించడంతో కోహ్లి ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో స్థానంలో నిలిచాడు. టాప్–10లో భారత్ నుంచి కోహ్లితో పాటు కేఎల్ రాహుల్ (4వ) ఉన్నాడు. -
కేకేఆర్‌పై పంజాబ్ ప్రతాపం
పంజాబ్ తెలుసుగా... 220 పైచిలుకు పరుగులు చేసినా కూడా ఓడింది. సూపర్ ఓవర్లో రెండంటే రెండు పరుగులు చేసిన జట్టు. ఒక్కమాటలో చెప్పాలంటే ఐపీఎల్ తొలి సగం మ్యాచ్‌ల్లో వరుసబెట్టి నిరాశపరిచింది. కానీ ఈ కింగ్స్... చెన్నై కింగ్స్‌లా కాదు! మొదటన్నీ ఓడినా... తర్వాతన్నీ గెలుచుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ దారిలో పడింది. షార్జా: ఈ సీజన్లో పంజాబ్‌ను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, అనుమానం కలుగకమానదు. ఒకదశలో ఏడింట ‘ఆరు’ ఓడిపోయిన జట్టు... వరుసగా విజయబావుటా ఎగరేస్తున్న జట్టు ఇదేనా అని కచ్చితంగా అనిపిస్తుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తన ప్రత్యర్థి జట్టపై పంజా విసురుతోంది. ఇది నిజం. అది కూడా వరుసగా! సోమవారం పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. మొదట కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ మోర్గాన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. షమీ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ క్రిస్ గేల్ (29 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిపించగా... మన్దీప్ (56 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలిపించాడు. షమీ తడఖా... పంజాబ్ కెప్టెన్ రాహుల్ టాస్ నెగ్గగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ మొదలైన రెండో బంతికే మ్యాక్స్‌వెల్... నితీశ్ రాణా (0)ను డకౌట్ చేశాడు. రెండో ఓవర్ వేసిన షమీ తన తడాఖా చూపాడు. నాలుగో బంతికి రాహుల్ త్రిపాటి (7)ని, ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్ (0)ను డకౌట్ చేశాడు. ఒక్కసారిగా 10/3 స్కోరుతో కోల్‌కతా కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ గిల్, కెప్టెన్ మోర్గాన్ నిలకడగా ఆడి వికెట్ల పతనాన్ని కాసేపు నిలువరించారు. శుబ్‌మన్ ఫిఫ్టీ... ఆత్మరక్షణలో పడిపోయిన నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్, మోర్గాన్లే నడిపించారు. ఈ జోడీ ఆడినంతవరకు పరుగులకు ఢోకా లేకుండా పోయింది. అయితే ఈ భాగస్వామ్యం ముగిశాక మళ్లీ తర్వాత వచ్చిన వారు కూడా ముందరి బ్యాట్స్‌మెన్‌నే అనుసరించారు. గేల్... మెరుపుల్! కింగ్స్ లక్ష్యఛేదన ఫోర్‌తో మొదలైంది. కమిన్స్ తొలి బంతిని రాహుల్ బౌండరీకి తరలించాడు. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద రాహుల్ (25 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో గేల్ క్రీజ్‌లోకి వచ్చాడు. వరుణ్ చక్రవర్తి, నరైన్ బౌలింగ్ల్లో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు ఓపెనర్ మన్దీప్ చూడచక్కని బౌండరీలతో నిలకడగా పరుగులు చేశాడు. 49 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. జట్టు 13.4 ఓవర్లలో 100 పరుగులను అధిగమించింది. కాసేపటికే గేల్ ఫిఫ్టీ 25 బంతుల్లోనే పూర్తయ్యింది. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జత చేశాక గేల్ ఔటైనా... మిగతా లాంఛనాన్ని పూరన్ (2 నాటౌట్)తో కలిసి మన్దీప్ పూర్తి చేశాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుబ్‌మన్ గిల్ (సి) పూరన్ (బి) షమీ 57; నితీశ్ రాణా (సి) గేల్ (బి) మ్యాక్స్‌వెల్ 0; రాహుల్ త్రిపాఠి (సి) కేఎల్ రాహుల్ (బి) షమీ 7; దినేశ్ కార్తీక్ (సి) రాహుల్ (బి) షమీ 0; మోర్గాన్ (సి) అశ్విన్ (బి) రవి బిష్ణోయ్ 40; నరైన్ (బి) జోర్డాన్ 6; నాగర్కోటి (బి) అశ్విన్ 6; కమిన్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 24; వరుణ్ చక్రవర్తి (బి) జోర్డాన్ 2; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–10, 4–91, 5–101, 6–113, 7–114, 8–136, 9–149. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 2–0–21–1, షమీ 4–0–35–3, అర్‡్షదీప్ సింగ్ 2–0– 18–0, మురుగన్ అశ్విన్ 4–0–27–1, జోర్డాన్ 4–0–25–2, రవి బిష్ణోయ్ 4–1–20–2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 28; మన్దీప్ సింగ్ (నాటౌట్) 66; క్రిస్ గేల్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) ఫెర్గూసన్ 51; పూరన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.5 ఓవర్లలో 2 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–47, 2–147. బౌలింగ్: కమిన్స్ 4–0–31–0, ప్రసి«ధ్ కృష్ణ 3–0–24–0, వరుణ్ చక్రవర్తి 4–0–34–1, నరైన్ 4–0–27–0, ఫెర్గూసన్ 3.5–0–32–1. -
ముంబై... జై జై
టోర్నీ జరిగేకొద్దీ ముంబై హోరెత్తిస్తోంది. ఆల్‌రౌండ్ సత్తా చాటుతోంది. బౌలింగ్‌తో కట్టేసి, మెరుపు బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని చుట్టేస్తోంది. తొలుత రాహుల్ చహర్ స్పిన్ మాయాజాలం రోహిత్ సేనకు బలంకాగా... ఓపెనర్లు రోహిత్, డికాక్ దూకుడుతో లక్ష్యం కూడా సులువైంది. వరుసగా ఐదో విజయంతో, ఓవరాల్‌గా ఆరో విజయంతో, మెరుగైన రన్‌రేట్‌తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. అబుదాబి: వరుసగా ఐదు పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గెలిచింది. దీనికి విరుద్ధంగా ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయం సాధించింది. ఐపీఎల్లో శుక్రవారం జరిగిన పోరులో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కమిన్స్ (36 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. మోర్గాన్ (29 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. స్పిన్నర్ రాహుల్ చహర్ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 16.5 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ డికాక్ (44 బంతుల్లో 78 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. అతనికే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. రోహిత్ శర్మ (36 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. కోల్‌కతా తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. టామ్ బాంటన్, కమలేశ్ నాగర్కోటి స్థానాల్లో క్రిస్ గ్రీన్, శివమ్ మావిలను తీసుకుంది. ముంబై జేమ్స్ ప్యాటిన్సన్పు పక్కనబెట్టి కూల్టర్నీల్ను తీసుకుంది. టాప్–4 బ్యాట్లెత్తారు... కోల్‌కతా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఇన్నింగ్స్‌ను వెంటాడింది. టాప్–4 బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి (7), శుబ్‌మన్ గిల్ (21), నితీశ్ రాణా (5), దినేశ్ కార్తీక్ (4) ఎవరూ క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించలేదు. చెత్తషాట్లకు భారీ మూల్యం చెల్లించుకున్నారు. మూడో ఓవర్లో రాహుల్‌ను బౌల్ట్ పెవిలియన్ చేర్చగా... కాసేపటికే నితీశ్‌ను కూల్టర్‌నీల్ ఔట్ చేశాడు. పవర్ ప్లే (6 ఓవర్లు)లో 33 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. కోల్‌కతాకు ఈ కష్టాలు చాలవన్నట్లు స్పిన్నర్ రాహుల్ చహర్ రెండు వరుస బంతుల్లో శుబ్‌మన్, దినేశ్ కార్తీక్‌లను ఔట్ చేయడంతో కోల్‌కతా 42 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. హిట్టర్ రసెల్, కొత్త కెప్టెన్ మోర్గాన్ క్రీజులో ఉండగా... 9వ ఓవర్లో జట్టు స్కోరు 50 పరుగులకు చేరింది. ఓ సిక్స్, ఫోర్ కొట్టిన రసెల్ (12)కు బుమ్రా చెక్‌పెట్టాడు. దీంతో 11వ ఓవర్లోనే నైట్‌రైడర్స్ సగం వికెట్లను కోల్పోయింది. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ మోర్గాన్ ఒక్కడే మిగిలాడు. ధాటిగా ఆడిన కమిన్స్... అయితే ఆ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్‌ను నడిపించలేదు. కమిన్స్ మెరుపులతో కోల్‌కతా గాడిన పడింది. కూల్టర్‌నీల్ వేసిన 13వ ఓవర్లో కమిన్స్ డీప్ స్క్వేర్‌లో భారీ సిక్సర్ బాదాడు. మరో రెండు బౌండరీలు కూడా కొట్టడంతో 16 పరుగులు వచ్చాయి. స్పిన్నర్లు రాహుల్ చహర్, కృనాల్ బౌలింగ్‌కు దిగడంతో మళ్లీ పరుగుల రాక తగ్గిపోయింది. బౌల్ట్ వేసిన 17వ ఓవర్లో మోర్గాన్ ఫోర్‌తో కోల్‌కతా ఆలస్యంగా 100 పరుగులను అధిగమించింది. మరుసటి ఓవర్ వేసిన బుమ్రా కేవలం 5 పరుగులే ఇవ్వడంతో కోల్‌కతా 18 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 113 పరుగులే చేసింది. బౌల్ట్ బౌలింగ్‌లో కమిన్స్ బ్యాట్ ఝులిపించాడు. వరుసగా 6, 4 బాదడంతో 14 పరుగులు వచ్చాయి. కూల్టర్‌నీల్ ఆఖరి ఓవర్లో బౌండరీతో కమిన్స్ అర్ధసెంచరీ (35 బంతుల్లో) పూర్తయ్యింది. మోర్గాన్ ఎట్టకేలకు బ్యాట్‌కు పనిచెప్పడంతో 2 భారీ సిక్సర్లు నమోదయ్యాయి. దీంతో 21 పరుగులు రావడంతో జట్టు స్కోరు 148 పరుగులకు చేరింది. 8వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన మోర్గాన్ ఆఖరిదాకా అజేయంగా నిలిచినా 40 పరుగులైనా చేయలేకపోయాడు. ఫోర్‌తో జోరు కొనసాగింపు... ఏమంత కష్టసాధ్యంకాని లక్ష్యానికి ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ చక్కని ఆరంభమిచ్చారు. ఇన్నింగ్స్ తొలి బంతినే ఫోర్‌గా మలచిన రోహిత్ తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు. మొదట్లో ‘హిట్‌మ్యాన్’ ధాటికి వెనుకబడిన డికాక్ దంచేందుకు ఎంతోసేపు పట్టలేదు. కమిన్స్, గ్రీన్ ఓవర్లలో చకచకా ఫోర్లు బాదేశాడు. ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టడంలో రోహిత్‌ను మించిపోయాడు. ముంబై 5.4 ఓవర్లలో 50 పరుగులకు చేరింది. తర్వాత ప్రసిధ్ కృష్ణ 7వ ఓవర్లో డికాక్ 2 బౌండరీలు, ఓ భారీ సిక్సర్ కొట్టాడు. రోహిత్ రెండు పదుల వద్దే తచ్చాడుతుంటే డికాక్ ఏకంగా 25 బంతుల్లోనే అర్ధశతకాన్ని (8 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించాడు. కమిన్స్, రస్సెల్, ప్రసిధ్ కృష్ణ, గ్రీన్ ఇలా కోల్‌కతా కెప్టెన్ పదే పదే బౌలర్లను మార్చినా... డికాక్ జోరును ఏమార్చలేకపోయాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై 9 పరుగుల రన్‌రేట్‌తో ముంబై 90 పరుగులు చేసింది. తర్వాతి ఓవర్లోనే ‘హిట్‌మ్యాన్’ అవుట్ కావడంతో 94 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. శివమ్ మావి ఈ జోడీని విడగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ (10)ను వరుణ్ పెవిలియన్ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో 2 వికెట్లు పడినా... డికాక్, హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో ముంబై 17వ ఓవర్ పూర్తవకముందే లక్ష్యాన్ని ఛేదించింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: త్రిపాఠి (సి) సూర్యకుమార్ (బి) బౌల్ట్ 7; గిల్ (సి) పొలార్డ్ (బి) రాహుల్ చహర్ 21; నితీశ్ రాణా (సి) డికాక్ (బి) కూల్టర్‌నీల్ 5; దినేశ్ కార్తీక్ (బి) రాహుల్ చహర్ 4; మోర్గాన్ (నాటౌట్) 39; రసెల్ (సి) డికాక్ (బి) బుమ్రా 12; కమిన్స్ (నాటౌట్) 53; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–18, 2–33, 3–42, 4–42, 5–61. బౌలింగ్: బౌల్ట్ 4–0–32–1, కూల్టర్‌నీల్ 4–0–51–1, బుమ్రా 4–0–22–1, కృనాల్ పాండ్యా 4–0–23–0, రాహుల్ చహర్ 4–0–18–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) దినేశ్ కార్తీక్ (బి) శివమ్ మావి 35; డికాక్ (నాటౌట్) 78; సూర్యకుమార్ యాదవ్ (బి) వరుణ్ 10; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.5 ఓవర్లలో 2 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–94, 2–111. బౌలింగ్: క్రిస్ గ్రీన్ 2.5–0–24–0, కమిన్స్ 3–0–28–0, ప్రసిధ్ కృష్ణ 2–0–30–0, రసెల్ 2–0–15–0, వరుణ్ చక్రవర్తి 4–0–23–1, శివమ్ మావి 3–0–24–1. -
ఎందుకూ అలా చూస్తున్నారు?
కోవిడ్ 19 లాక్డౌన్ ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన అనుభవాన్ని మిగులుస్తోంది. ఈ చిన్నారి తల్లికి మాత్రం కోవిడ్ తెలియదు, లాక్డౌన్ తెలియదు. ఇంకా... తనకు ఏం జరుగుతోందో కూడా తెలియదు. లక్షల మంది తనను చూస్తున్నారని, ప్రశంసలు– విమర్శలతో అనేక కామెంట్లకు తాను కేంద్రబిందువు అవుతున్నట్లు కూడా తెలియదు పాపం. దీనంతటికీ కారణం ఈ బుజ్జాయి తల్లి సరదానే. మోర్గాన్ 28 ఏళ్ల మహిళ. యూఎస్, ఓరేగాన్లో ఉంటుంది. లాక్డౌన్లో రోజుకు ఉన్న 24 గంటల సమయాన్ని ఎలా గడపాలో తెలియని వాళ్లలో కొంత మంది కొత్త వంటలు చేయడం, డాన్సులు చేయడం, పాటలు పాడి సోషల్ మీడియాలో షేర్ చేయడం... ఇలా ఎవరికి ఇష్టమైన వ్యాపకంలో వాళ్లు మునిగిపోతున్నారు. మోర్గాన్ మాత్రం తన మూడు నెలల పాపాయి ల్యూటన్ మే రోజ్ని రోజుకో రకంగా అలంకరించుకుని మురిసిపోయేది. ఓ రోజు పాపాయికి పెద్ద కనుబొమలు గీసి వీడియో తీసి టిక్‌టాక్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆమె సరదాలను చాలా మంది ఆస్వాదించారు. ప్రశంసలు రావడంతో మరో రెండు రకాలుగా మేకప్ చేసి వీడియోలు పెట్టిందామె. మొత్తానికి బుజ్జాయిని పది లక్షల మంది చూశారు. కొంతమంది ‘ఇంత కచ్చితంగా కనుబొమలను ఎలా దిద్దగలిగారు’ అని ఆశ్చర్యపోయారు. ‘మూడు నెలల పాపాయికి కళ్లు మూసి తెరిచేంతలో యాభై ఏళ్ల వయసు మీద పడినట్లైంది’ అని ఒకరు, ‘మీ అమ్మాయి మిమ్మల్ని క్షమించదు సుమా’ అని ఒకరు చమత్కరించారు. కొంతమంది నవ్వారు, కొంతమంది ‘చందమామలాంటి పాపాయిని వికృతంగా తయారు చేయడమేంటి? ఇదేం పిచ్చిపని’ అని పెదవి విరిచారు. పాపం రోజీ బుజ్జాయికి ఇవేమీ తెలియదు. తాను నిద్రపోయిన తర్వాత అమ్మ తనకు మేకప్ చేసిందని తెలియని పాపాయి, కళ్లు తెరిచిన తర్వాత బోసి నవ్వులతో వీడియోని పండిస్తోంది. -
యస్ బ్యాంక్‌లో కపూర్
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్‌లో ప్రమోటర్ సంస్థ, మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎమ్‌సీపీఎల్) 2.3 శాతం వాటాకు సమానమైన 5.8 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.58.1 ధరకు విక్రయించింది. వీటి విలువ రూ.334 కోట్లు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్(ఆర్‌నామ్) ఎన్‌సీడీలకు ముందుగానే చెల్లింపులు జరపడానికి, మరోవైపు ఆర్బీఐ నిబంధనల ప్రకారం యస్‌బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా తగ్గించుకునే క్రమంలో భాగంగా మోర్గాన్ క్రెడిట్స్ ఈ షేర్లను విక్రయించింది. యస్ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్‌కు చెందిన ముగ్గురు కూతుళ్లు ఈ ఎమ్‌సీపీఎల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వాటా విక్రయంతో రాణా కపూర్ కుటుంబం వాటా యస్ బ్యాంక్‌లో 7.4 శాతానికి తగ్గుతుంది. యస్ బ్యాంక్ 2004 నుంచి కార్యకలాపాలు నిర్వహించడం మొదలు పెట్టిందని, గత 15 ఏళ్లలో మంచి వృద్ధిని సాధించామని రాణా తెలిపారు. మోర్గాన్ క్రెడిట్స్ కంపెనీ 2018 ఏప్రిల్‌లో ఆర్‌నామ్)కి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీ)జారీ చేసి రూ.1,160 కోట్లు సమీకరించింది. ఈ బాండ్లు 2021, ఏప్రిల్‌లో మెచ్యూర్ అవుతాయి. ఈ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను స్టార్టప్ బిజినెస్‌ల కోసం మోర్గాన్ క్రెడిట్స్ వినియోగించింది. ఈ బాండ్లకు సంబంధించి ముందస్తుగా చెల్లించాల్సిన(వడ్డీతో కలుపుకొని) మొత్తం ఇప్పటిదాకా రూ.722 కోట్లుగా ఉంది. యస్‌బ్యాంక్‌లో విక్రయించిన వాటా ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆర్‌నామ్ ఎన్‌సీడీలకు చెల్లింపులు జరపడానికి మోర్గాన్ క్రెడిట్స్ ఉపయోగించనున్నది. -
లార్డ్స్ నుంచి లార్డ్స్ వరకు...
సాక్షి క్రీడా విభాగం: గత నాలుగేళ్లలో ఇంగ్లండ్ అద్భుతమైన వన్డే క్రికెట్ ఆడింది. ఎన్నో రికార్డులు ఆ జట్టు పాదాక్రాంతమయ్యాయి. ఏ దశలోనూ భయం, బెరుకు లేకుండా ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ ఆ జట్టు ప్రదర్శించిన జోరు ప్రపంచకప్ గెలుపుపై ఆశలు రేపింది. ఇంగ్లండ్ జట్టు టాప్–20 వన్డే అత్యధిక స్కోర్ల జాబితాలో (అన్ని 350 పరుగులకు మించి) రెండు మినహా మిగిలిన 18 స్కోర్లు 2015 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాతే వచ్చాయంటే ఆ జట్టు సాధించిన పురోగతి ఏమిటో అర్థమవుతుంది. ఇందులో 481 పరుగుల ప్రపంచ రికార్డు స్కోరు కూడా ఉంది. ఇదంతా అంత సులువుగా జరగలేదు. కెప్టెన్ మోర్గాన్, కోచ్ ట్రెవర్ బేలిస్ కలిసి మూలాల నుంచి పరిస్థితి మార్చేందుకు సంకల్పించారు. ముందుగా సాంప్రదాయ ముద్ర నుంచి జట్టును బయట పడేసే ప్రయత్నం చేశారు. టెస్టుల్లో దిగ్గజాలే అయినా వన్డే క్రికెట్‌కు పనికి రారంటూ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, బెల్‌లాంటి వారిని బయటకు పంపించడంతో జట్టు ప్రక్షాళన మొదలైంది. వారి స్థానాల్లో ఆల్‌రౌండర్లతో జట్టును నింపేశారు. అవసరమైతే పదో నంబర్ ఆటగాడు కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందనే ఆలోచన నిజంగానే చాలా బాగా పని చేసింది. వరుస విజయాలు వచ్చి చేరడంతో గత ఏడాది మేలో తొలిసారి ఇంగ్లండ్ వన్డేల్లో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇక అక్కడి నుంచి తదుపరి లక్ష్యం ప్రపంచ కప్ విజయమే. ఆ దారిలో దూసుకుపోయిన మోర్గాన్ సేన తమ దేశంలో సంబరాలు పంచింది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు, అభిమానులకు, బోర్డుకు, ప్రసారకర్తలకు, ప్రకటనదారులకు అందరికీ తెలుసు ఈసారి సాధ్యం కాకపోతే ఇంకెప్పటికీ ఇంగ్లండ్ వన్డే ప్రపంచ కప్ గెలవలేదని. పేరుకే క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టినా, వన్డే వరల్డ్ కప్ అక్కడే తొలి అడుగు వేసినా... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని జట్టుగా అవమాన భారాన్ని ఆ జట్టు ఇంత కాలంగా మోస్తూనే వచ్చింది. ఇంగ్లండ్ ప్రదర్శనపై ఎన్నో విమర్శలు, మరెన్నో జోక్‌లు ప్రచారంలో ఉన్న సంగతీ వారికి తెలియనిది కాదు. గత వరల్డ్‌కప్‌లో ఘోర వైఫల్యం తర్వాతనైతే అసలు ఇంగ్లండ్ టీమ్‌ను ఎవరూ లెక్కలోకి తీసుకోని పరిస్థితి. కానీ కొత్త ఇంగ్లండ్ జట్టు చరిత్రను తిరగరాసింది. అసమాన ఆటతీరుతో సత్తా చాటి ఇన్నేళ్ల ప్రశ్నలకు ఒకేసారి సమాధానం ఇచ్చింది. పాత గాయాలు అంత తొందరగా మానేవి కావు. 1992లో పాకిస్తాన్ బౌలర్ వసీమ్ అక్రమ్ వేసిన రెండు అద్భుత బంతులతో ప్రపంచ కప్ కల చెల్లాచెదురైన తర్వాత మళ్లీ కోలుకునేందుకు ఇంగ్లండ్‌కు 27 ఏళ్లు పట్టింది. న్యూజిలాండ్ కంటే కూడా ఇంగ్లండ్‌కు ఈ విజయం ఎంతో అవసరం. ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవలేదన్న పేరును తొలగించుకునేందుకు స్వదేశంలో ఇంతకంటే మంచి అవకాశం వారికి రాదు. దానిని ఒడిసిపట్టుకొని మోర్గాన్ సేన తమ దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది. దాదాపు ఏడాది కాలంగా ఇంగ్లండ్ అభిమానులు ‘ఇట్స్ కమింగ్ హోమ్’ అంటూ గొంతు చించుకుంటూ హోరెత్తిస్తుండగా మోర్గాన్ సేన కోటి ఆశలతో మైదానంలో తమ ఆట మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో 100 పరుగులకు పైగా తేడాతో గెలవగానే ఇంగ్లిష్ సేన సంబరపడిపోయింది. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్ జట్టును నేలకు దించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా చితక్కొట్టగా, శ్రీలంక చేతిలో ఓటమి పాత ఇంగ్లండ్‌ను గుర్తుకు తెచ్చింది. నిజంగా ఇంగ్లండ్ సెమీస్ చేరకపోయి ఉంటే ఆ క్షణాన ఎన్ని గుండెలు బద్దలయ్యేవో... కానీ భారత్‌పై గెలుపు మళ్లీ ఆశలు నిలబెట్టింది. ఈ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసమే కివీస్‌నూ ఓడించి దర్జాగా సెమీస్ చేరేలా చేసింది. ఇక ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరడం జట్టు ఆనందాన్ని రెట్టింపు చేసింది. లీగ్‌లో తమ చేతిలో చిత్తయిన కివీస్‌పై ఫైనల్ అనగానే సహజంగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. భారత్‌నే ఓడించిన న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇంగ్లండ్‌కు తెలుసు. రసవత్తర ఫైనల్ దానిని నిజం చేసింది. చివరకు అశేష అభిమానుల జయజయధ్వానాలతో సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. ఇంగ్లండ్ విజయంలో అందరికీ సమష్టి పాత్ర ఉంది. ఓపెనర్లుగా బెయిర్‌స్టో (532 పరుగులు), జేసన్ రాయ్ (443 పరుగులు) అద్భుత ఆరంభాలు అందిస్తే, జో రూట్ (556 పరుగులు), స్టోక్స్ (465 పరుగులు), బట్లర్ (312 పరుగులు) మధ్యలో దానిని కొనసాగించారు. మోర్గాన్ (371 పరుగులు) బ్యాట్స్‌మన్‌గా కంటే కెప్టెన్‌గా తనదైన ముద్ర చూపించగలిగాడు. ఫైనల్లో స్టోక్స్, బట్లర్ ఆడిన ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. లోతైన బ్యాటింగ్ వనరులు ఉండటం కూడా జట్టుకు కలిసొచ్చింది. ఇక బౌలింగ్‌లో ఆర్చర్ (20 వికెట్లు) అత్యధిక వికెట్లతో చెలరేగితే వుడ్ (18 వికెట్లు), వోక్స్ (16 వికెట్లు) ప్రత్యర్థులను కట్టిపడేశారు. ప్లంకెట్ 11 వికెట్లే తీసినా అవి కీలక సమయంలో జట్టుకు అవసరమైనప్పుడు వచ్చాయి. అందరిలోకి స్టోక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 2016 టి20 ఫైనల్ చివరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు ఇచ్చి కప్ కోల్పోవడానికి కారణమైన అతనికి ఇది పాపపరిహారంగా చెప్పుకోవచ్చు. ఫైనల్లో చివరి వరకు నిలబడి అతను జట్టును గెలిపించాడు. అయితే ఐదు అర్ధసెంచరీలు ఇంగ్లండ్ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించాయి. 1975, జూన్ 7: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. క్రికెట్‌ను కనుగొన్న దేశం వరల్డ్ కప్ గెలవాలనే కలతో, ఆశలు అడుగుపెట్టిన రోజది. 2019, జూలై 14: లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ విశ్వ విజేతగా నిలిచి సగర్వంగా ట్రోఫీని సొంతం చేసుకున్న రోజు... నాటి కల నెరవేరేందుకు ఇంగ్లండ్‌కు ఏకంగా 44 ఏళ్లు పట్టింది. -
విశ్వ కిరీటం... పుట్టింటికా? కివీ గూటికా?
ప్రారంభంలో చప్పగా సాగుతోందన్నారు వారాలు గడుస్తున్నా ఊపు లేదన్నారు మ్యాచ్‌లు తరుగుతున్నా మజా ఏదన్నారు మధ్యలోకి వచ్చేసరికి కాక మొదలైంది రంజైన మ్యాచ్‌లతో ఆట రక్తి కట్టింది ఇప్పుడిక ప్రపంచ కప్ ఆఖరి అంకం 46వ రోజున 48వ మ్యాచ్‌తో ముగింపు వన్డే కిరీటం ఎవరిదో తేలిపోయే సందర్భం రానున్న నాలుగేళ్లకు రారాజు పట్టాభిషేకం దూకుడైన ఇంగ్లండ్... నిబ్బరంగా న్యూజిలాండ్ జగజ్జేత హోదా పుట్టింటికి దక్కుతుందా? రెక్కలు కట్టుకుని కివీస్ గూటిలో వాలుతుందా? క్రికెట్ మక్కా లార్డ్స్‌లో... అందమైన బాల్కనీ నుంచి... సగర్వంగా కప్‌ను చూపే కెప్టెన్ ఎవరో? మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర తర్వాత తెరపైకి ‘సరికొత్త విజేత’ అభిమానులూ... ఆస్వాదించండి! లండన్: వన్డే క్రికెట్లో 23 ఏళ్ల తర్వాత సరికొత్త చాంపియన్ ఆవిర్భావానికి 12వ ప్రపంచ కప్ వేదిక కాబోతోంది. తొలిసారి జగజ్జేతగా నిలిచేందుకు లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం ఇంగ్లండ్, న్యూజిలాండ్ తుది సమరంలో తలపడనున్నాయి. మ్యాచ్‌లో ఎవరు గెలిచినా అది వారి దేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిపోనుంది. ఇరు జట్ల బలాబలాల ప్రకారం చూస్తే ఈ ఫైనల్‌ను బ్యాటింగ్, పేస్ బౌలింగ్ మధ్య పోటీగా పేర్కొనవచ్చు. దూకుడైన ఆటతో పైచేయి సాధించడం ఇంగ్లండ్ వ్యూహం కాగా... నెమ్మదిగా పట్టు బిగించే స్వభావం న్యూజిలాండ్‌ది. మరి అంతిమ పోరులో ఎవరి ప్రణాళికలు విజయవంతం అవుతాయో చూడాలి? మార్పుల్లేకుండానే! అత్యంత కీలక మ్యాచ్ కాబట్టి రెండు జట్లు తాము సెమీఫైనల్లో ఆడిన తుది పదకొండు మందితోనే ఫైనల్లో దిగే వీలుంది. పైకి కనిపించకున్నా అటు ఇటు ఒకరిద్దరు ఆటగాళ్లే కీలకం. జేసన్ రాయ్, రూట్‌ను త్వరగా ఔట్ చేస్తే ఆతిథ్య జట్టు పరోక్షంగానైనా ఆత్మరక్షణలో పడటం ఖాయం. ఈ నేపథ్యంలో విధ్వంసక జాస్ బట్లర్ నుంచి భారీ ఇన్నింగ్స్ నమోదవాల్సి ఉంటుంది. అనంతరం కెప్టెన్ మోర్గాన్, ఆల్‌రౌండర్ స్టోక్స్ బాధ్యతలు తీసుకుంటారు. ఇక విలియమ్సన్, రాస్ టేలర్ తేలిపోతే న్యూజిలాండ్ పని ఖతం. అసలే ఆ జట్టు ఓపెనర్లు గప్టిల్, నికోల్స్ పేలవ ఫామ్‌తో సతమతం అవుతోంది. లాథమ్, గ్రాండ్‌హోమ్, నీషమ్ అదనపు పరుగులు జోడించగలరు తప్ప పరిస్థితిని అమాంతం మార్చలేరు. మొత్తమ్మీద చూస్తే బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంతో ఉన్నందున ఇంగ్లండ్‌కు ఫేవరెట్ మార్కులు ఎక్కువగా పడతాయి. బ్యాటింగ్‌లో బలహీనంగా ఉన్నా టోర్నీలో కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకుని గెలిచినందున కివీస్‌ను తేలిగ్గా తీసుకోలేం. చరిత్ర బాటలో ఈ ఇద్దరు ఐర్లాండ్ జాతీయుడైన మోర్గాన్ ఇంగ్లండ్ తరఫున ఆడటమే అనూహ్యం అనుకుంటే, కెప్టెన్‌గానూ ఎదిగి, ఇప్పుడు ప్రపంచ కప్ సాధించే వరకు తీసుకొచ్చాడు. గాటింగ్, గూచ్ వంటి మహామహులకు సాధ్యం కాని ఈ చిరకాల స్వప్నాన్ని గనుక నెరవేరిస్తే మోర్గాన్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అటు విలియమ్సన్‌కూ అంతే స్థాయిలో ఖ్యాతి దక్కుతుంది. మార్టిన్ క్రో, బ్రెండన్ మెకల్లమ్ వంటి తమ దేశ దిగ్గజాలకు త్రుటిలో చేజారిన కప్‌ను సాధిస్తే... ఇప్పటికే ప్రపంచ శ్రేణి బ్యాట్స్‌మన్‌గా పేరున్న అతడు వ్యక్తిగతంగా మరో మెట్టెక్కుతాడు. నాలుగోసారి... రెండోసారి.... ఇంగ్లండ్ ప్రపంచకప్ ఫైనల్ ఆడటం ఇది నాలుగోసారి. 1979, 87, 92లలో ఆ జట్టు తుది సమరానికి అర్హత సాధించింది. న్యూజిలాండ్ 2015 కప్ రన్నరప్. చిత్రమేమంటే ఇంగ్లండ్ ఆటగాళ్లందరికీ ఇదే తొలి ఫైనల్. కివీస్ తరఫున గత ఫైనల్ మ్యాచ్ ఆడిన గప్టిల్, విలియమ్సన్, టేలర్, బౌల్ట్, హెన్రీ ఈసారీ బరిలో దిగనున్నారు. అటో గోడ.. ఇటో గోడ ఇరు జట్లలో అంత తొందరగా బద్దలు కొట్టలేనంతటి రెండు బ్యాటింగ్ గోడలున్నాయి. అవే విలియమ్సన్ , రూట్ (549 పరుగులు). పోటాపోటీగా రాణించిన ఈ ఇద్దరూ సమవయస్కులే. ఒకే తరహా బ్యాటింగ్ శైలి వారే. తమ జట్ల విజయాల్లో కీలకంగా మారినవారే. ఎలాంటి సందర్భంలోనైనా ఇన్నింగ్స్‌లు నిర్మించగలవారే. ఫైనల్లో ఎవరు తమ పాత్ర సమర్థంగా పోషిస్తారో చూద్దాం. వీరి సమరం ఆసక్తికరం రాయ్, బెయిర్‌స్టో x బౌల్ట్, హెన్రీ జేసన్ రాయ్ (426 పరుగులు), బెయిర్‌స్టో (496 పరుగులు)... టోర్నీలో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జంట. గాయంతో రాయ్ దూరమైతే ఓ దశలో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నది జట్టు. అప్పుడు బెయిర్‌స్టో ఒంటరివాడైనట్లు కనిపించాడు. భారత్‌తో మ్యాచ్‌లో రాయ్ పునరాగమనంతో ఈ జోడీ మళ్లీ తడాఖా చూపుతోంది. ఫైనల్లో వీరికి న్యూజిలాండ్ పేసర్లు బౌల్ట్ (17 వికెట్లు), హెన్రీ (13 వికెట్లు) అడ్డుకట్ట వేస్తే ఇంగ్లండ్‌కు ముకుతాడు పడినట్లే. కచ్చితమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేసే ఈ జోడీకి మరో పేసర్ లాకీ ఫెర్గూసన్ (18 వికెట్లు) తోడైతే ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పవు. విలియమ్సన్, టేలర్ X ఆర్చర్, వోక్స్ న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరిందంటే అది కెప్టెన్ విలియమ్సన్ (548 పరుగులు) విశేష రాణింపు, రాస్ టేలర్ (335 పరుగులు) నిలకడతోనే. భారత్‌తో జరిగిన సెమీస్‌లో వీరి అర్ధ సెంచరీలే ఈ విషయాన్ని చాటుతాయి. ఈ ఇద్దరికీ ఇంగ్లండ్ పేసర్లు ఆర్చర్ (19 వికెట్లు), వోక్స్ (13 వికెట్లు) నుంచి సవాల్ ఎదురవడం ఖాయం. మూడో పేసర్ మార్క్ వుడ్ (17 వికెట్లు) కూడా తక్కువేం కాదు. కేన్–టేలర్ జోడీ... వీరిని కాచుకొని క్రీజులో నిలదొక్కుకుంటే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగే అవకాశం ఉంటుంది. స్పిన్నర్లూ ఉన్నారోయ్... బ్యాటింగ్‌కు అనుకూలమైనా, పేసర్లు పండుగ చేసుకుంటున్నా ఈ కప్‌లో స్పిన్నర్లూ అంతోఇంతో ప్రభావం చూపారు. అలాంటివారిలో ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్, 11 వికెట్లు), సాన్‌ట్నర్ (న్యూజిలాండ్, 6 వికెట్లు) ముఖ్యులు. స్పిన్‌ను సమర్థంగా ఆడే భారత్‌ను సెమీస్‌లో సాన్‌ట్నర్ కట్టి పడేశాడు. రషీద్... ఆస్ట్రేలియాపై నిర్ణయాత్మక ప్రదర్శన కనబర్చాడు. ఇక ఫైనల్స్‌లో అవసరమైన సందర్భంలో వీరు ఎలాంటి పాత్ర పోషిస్తారో? తుది జట్లు (అంచనా) ఇంగ్లండ్: జేసన్ రాయ్, బెయిర్‌స్టో, రూట్, మోర్గాన్ (కెప్టెన్), స్టోక్స్, బట్లర్, వోక్స్, ప్లంకెట్, ఆర్చర్, రషీద్, మార్క్ వుడ్. న్యూజిలాండ్: గప్టిల్, నికోల్స్, విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, నీషమ్, లాథమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, హెన్రీ, బౌల్ట్, ఫెర్గూసన్. పిచ్, వాతావరణం శనివారం వరకు పిచ్‌పై సన్నటి పొరలా పచ్చిక ఉంది. వేడి ప్రభావంతో ఆదివారం మ్యాచ్ సమయానికి అది ఎండిపోవచ్చు. తద్వారా సహజ స్వభావంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. పిచ్‌ను పరిశీలించిన మోర్గాన్ మ్యాచ్ మొదలయ్యే వేళకు ఓ అంచనాకు రావొచ్చని అన్నాడు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఫైనల్‌కూ రిజర్వ్ డే ఉంది. ఆదివారం వర్షం వల్ల అంతరాయం కలిగి ఫలితం రాకపోతే సోమవారం కొనసాగిస్తారు. ఒకవేళ ఫైనల్ ‘టై’ అయితే ‘సూపర్ ఓవర్’ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. మ్యాచ్ రద్దయితే మాత్రం రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ముఖాముఖిలో పోటాపోటీ... ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 90 మ్యాచ్‌లు జరిగాయి. న్యూజిలాండ్ 43 మ్యాచ్‌లు, ఇంగ్లండ్ 41 గెలిచాయి. రెండు ‘టై’ కాగా, నాలుగింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచకప్‌లో 9 సార్లు ఎదురుపడగా ఐదుసార్లు కివీస్, నాలుగుసార్లు ఇంగ్లండ్ నెగ్గాయి. -
ఇంగ్లండ్ కెప్టెన్‌గా మోర్గాన్
లండన్: స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యులుగల ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. ఈ మెగా ఈవెంట్లో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా మోర్గాన్ వ్యవహరిస్తాడు. ఇంగ్లండ్ జట్టు: మోర్గాన్ (కెప్టెన్), జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్, జో రూట్, బెయిర్‌స్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, టామ్ కరన్, ఆదిల్ రషీద్, జో డెన్లీ, ప్లంకెట్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. -
వన్డే వీరులెవరో..!
ఏకంగా 31 సార్లు 300కు పైగా స్కోరు... 11 సార్లు 350కు పైగా... 3 సార్లు 400కు పైగా... గత వన్డే వరల్డ్ కప్‌లో ఘోర వైఫల్యం తర్వాతి నుంచి ఇంగ్లండ్ జోరు ఇది. వన్డే ఆటకు కొత్త అర్థాన్ని చెబుతున్న మోర్గాన్ సేన ఒక వైపు... అక్కడా, ఇక్కడా అని తేడా లేకుండా ఎక్కడైనా సవాల్‌కు సిద్ధం అన్నట్లుగా చెలరేగిపోతూ వరుసగా ఆరు వన్డే సిరీస్‌లను గెలుచుకున్న భారత్ మరోవైపు. సొంతగడ్డపై ఆడటం, అద్భుతమైన ఫామ్ ఇంగ్లండ్‌కు బలమైతే... ఇప్పటి వరకు మాలాంటి ప్రత్యర్థి మీకు ఎదురు కాలేదన్నట్లుగా టి20 సిరీస్‌లో విజయంతో చూపించిన దూకుడు కోహ్లి బృందం సొంతం. ఈ నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్–1 ఇంగ్లండ్, నంబర్–2 భారత్ మధ్య వన్డే వీరులెవరో తేలిపోయే సమరానికి నేడు తెర లేవనుంది. నాటింగ్‌హామ్: సరిగ్గా వచ్చే ఏడాది ఇదే సమయంలో ఇంగ్లండ్ గడ్డపై వన్డే వరల్డ్ కప్ ఆడనున్న భారత్‌కు అక్కడి పరిస్థితులు, పిచ్‌లపై ఒక అంచనాకు వచ్చేందుకు, తమ బలగాన్ని పరీక్షించుకునేందుకు ఇది సదవకాశం. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే టి20 సిరీస్ గెలుచుకున్న టీమిం డియా ఇక్కడా విజయం సాధించాలని పట్టుదలతో ఉండగా, వన్డేల్లో ఇటీవలి తమ ధాటిని కొనసాగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. 2014లో ఇక్కడ ఆడిన తమ చివరి పర్యటనలో భారత్ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. నాలుగో స్థానంలో కోహ్లి! టి20 సిరీస్‌లో విజయం సాధించిన తర్వాత వన్డేల కోసం కూడా భారత జట్టులో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. దాదాపు అదే జట్టు ఇక్కడా కొనసాగవచ్చు. కేఎల్ రాహుల్ ఫామ్‌ను బట్టి చూస్తే అతని కోసం కోహ్లి మరోసారి నాలుగో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. రోహిత్ శర్మ ఊపు మీదుండగా, ధావన్ ఫామ్ కొంత ఇబ్బందిగా మారింది. అయితే వన్డేల్లో ధావన్ ప్రమాదకరమైన ఆటగాడే కాబట్టి జట్టు బెంగ పడటం లేదు. టి20ల్లో అవకాశం దక్కని దినేశ్ కార్తీక్‌కు మిడిలార్డర్లో బ్యాట్స్‌మన్‌గా చోటు ఖాయమైంది. అతని కోసం రైనాను పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తోంది. చివరి ఓవర్లలో పాండ్యా, ధోని చెలరేగిపోగలరు. బౌలింగ్‌లో మరోసారి ఇద్దరు లెగ్‌స్పిన్నర్లు కుల్దీప్, చహల్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టగలరు. పేస్‌లో ఉమేశ్‌కు చోటు ఖాయం కాగా, భువనేశ్వర్ కోలుకోకపోతే శార్దుల్ జట్టులోకి వస్తాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆడిన 26 వన్డేల్లో 21 గెలవడం భారత్ ఫామ్‌కు సూచిక. హేల్స్ స్థానంలో స్టోక్స్! ఇటీవలే ఆస్ట్రేలియాను 5–0తో చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని కోరుకుంటోంది. ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్ స్టో ఇటీవల వందకు పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్నారు. 864 పరుగులతో బెయిర్ స్టో 2018లో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతుండగా, జేసన్ రాయ్ మూడు సెంచరీలు బాదాడు. రూట్ చక్కటి వన్డే ఆటగాడు కాగా, మోర్గాన్ బ్యాటింగ్ కూడా కీలకం. ఐపీఎల్ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బట్లర్ ఈసారి మిడిలార్డర్లో తన సత్తా ప్రదర్శించేందుకు సిద్ధమయ్యాడు. ఆసీస్‌తో వన్డేలు ఆడని ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు ఇప్పుడు నేరుగా జట్టులో చోటు ఖాయం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరో హిట్టర్ హేల్స్‌ను ఇంగ్లండ్ పక్కన పెట్టాల్సి వస్తోంది. బౌలింగ్ కొంత బలహీనంగా కనిపిస్తున్నా... బ్యాటింగ్ బలంతో దానిని అధిగమించగలమని ఇంగ్లండ్ నమ్ముతోంది. గత ఏడాది కాలంలో ఆడిన 21 వన్డేల్లో ఇంగ్లండ్ 4 మాత్రమే ఓడింది. పిచ్, వాతావరణం ఇంగ్లండ్‌లో ఇది నడి వేసవి. పొడిబారిన పిచ్ సిద్ధం. కాబట్టి పరుగుల వరద ఖాయం. ఇంగ్లండ్ రెండు వరల్డ్ రికార్డు స్కోర్లు (444, 481) గత రెండు మ్యాచ్‌లలో ఇదే మైదానంలో వచ్చాయి. సాయంత్రం గం. 5 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లో ప్రత్యక్ష ప్రసారం -
తొలి సెమీస్: మోర్గాన్ రికార్డ్
కార్డిఫ్: చాంపియన్స్ ట్రోఫీలో జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో మరో రికార్డు నమోదైంది. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 5000 పరుగుల మైలురాయిని దాటాడు. ఈ ఘనత సాధించిన మూడో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేశాడు. బెల్ 5416, కాలింగ్ ఉడ్ 5092లు మోర్గాన్ కన్నా ముందున్నారు. క్రీజులో కుదురుకుంటున్నట్లు కనిపించిన మోర్గాన్ 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హసన్ అలీ బౌలింగ్‌లో కీపర్ సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లండ్ 148 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో బెన్ స్టోక్స్, మోయిన్ అలీ లు పోరాడుతున్నారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ(2), రుమాన్ రాయిస్ (1), షాదాబ్ ఖాన్ (1), జునైద్ ఖాన్(1) వికెట్లు పడగొట్టారు. -
'ఆ క్రికెటర్ ను ప్రతీ జట్టు కోరుకుంటుంది'
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోని ప్రతీ క్రికెట్ జట్టు బెన్ స్టోక్స్ లాంటి ఆల్ రౌండర్ని కచ్చితంగా కోరుకుంటుందని కొనియాడాడు. ఈ విషయం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వంటి వేలంలో నిరూపించబడిందని మోర్గాన్ ప్రస్తావించాడు. ' బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో స్టోక్స్ ది ప్రత్యేక స్థానం. అతనొక కీలకమైన ఆల్ రౌండర్. అతను జట్టులో ఉన్నాడంటే భరోసా ఉంటుంది. నిన్నటి మ్యాచ్ లో చాలా పరుగుల్ని స్టోక్స్ సేవ్ చేశాడు. దాంతో పాటు బౌలింగ్ లో కూడా మెరిశాడు. బ్యాటింగ్ లో సెంచరీతో అదరగొట్టాడు. మా జట్టులో స్టోక్స్ ఉండటం నిజంగా అదృష్టం. ఏదో రకంగా జట్టుకు ఉపయోగపడుతూనే ఉంటాడు. అతని లాంటి ఆటగాడ్ని ఏ జట్టైనా కోరుకుంటుంది'అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ భారాన్ని స్టోక్స్ తన భుజాలపై వేసుకుంటాడన్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్టోక్స్ చేసిన సెంచరీనే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో బెన్ స్టోక్స్ (109 బంతుల్లో 102 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. -
అది వన్డేలాడే పిచ్‌లా ఉందా?
లార్డ్స్:దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన మూడో వన్డే పిచ్‌పై ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఇది వన్డేలాడే పిచ్‌లా ఉందా అంటూ పిచ్ ను రూపొందించిన క్యూరేటర్లపై అసహనం వ్యక్తం చేశాడు. సోమవారం జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ కు దిగి 30 బంతుల్లో 20 పరుగులిచ్చి ఆరు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో ఇంగ్లండ్ సాధారణ స్కోరుకే పరిమితమై ఘోర ఓటమి పాలైంది. అనంతరం మాట్లాడిన మోర్గాన్.. వన్డే మ్యాచ్ కు ఒక పేలవమైన పిచ్ రూపొందించడాన్ని తప్పుబట్టాడు. ' ఇది వన్డేలాడే పిచ్‌లా ఎంతమాత్రం లేదు. ఇది ఏ జట్టుకు మంచిది కాదు. ఈ తరహా పిచ్ పై ఎవరు ముందుగా బ్యాటింగ్ చేసినా కష్టాలు తప్పవు. ఇంతటి పేలవమైన పిచ్ ను ఎందుకు రూపొందించినట్లు. పిచ్ పై గడ్డి ఎక్కువగా ఉండటంతో పేసర్లకు స్వర్గధామంలా మారింది. సహజసిద్ధమైన గేమ్ ను ఆడటం కూడా కష్టంగా మారిపోయింది'అని మోర్గాన్ విమర్శించాడు.మరొకవైపు తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా తిరిగి తేరుకున్న తీరును మోర్గాన్ అభినందించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు తమకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయిన విధానం ఆకట్టుకుందన్నాడు. -
ఇంగ్లండ్‌ను ఆపతరమా!
►అద్భుత ఫామ్‌లో మోర్గాన్ సేన ►సొంతగడ్డపై టైటిల్ సాధించడమే లక్ష్యం ►చాంపియన్స్ ట్రోఫీలో రెండు సార్లు ఫైనల్‌కు 339, 328, 328, 296, 321, 350, 309, 302, 444, 324... ముందుగా బ్యాటింగ్ చేసిన గత పది వన్డేల్లో ఇంగ్లండ్ జట్టు సాధించిన స్కోర్లు ఇవి. అంటే సగటున ప్రతీ మ్యాచ్‌కు ఆ జట్టు 334 పరుగులు చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు సాంప్రదాయ టెస్టులు మినహా వన్డేల్లో ఈ టీమ్ అసలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అయితే గత రెండేళ్లలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. స్పెషలిస్ట్ ఆటగాళ్లతో ప్రపంచంలో ఏ వేదికలోనైనా వన్డేల్లో భారీ స్కోర్లు సాధిస్తున్న ఇంగ్లండ్ బలమైన జట్టుగా ఎదిగింది. తమ వన్డే చరిత్రలో అత్యుత్తమ దశలో ఉన్న ఇంగ్లండ్... సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఇంగ్లండ్‌లోనే జరిగిన రెండు చాంపియన్స్ ట్రోఫీల్లోనూ ఫైనల్లో ఓడిన ఆ జట్టు ఈసారి మాత్రం చరిత్ర తిరగరాయాలని పట్టుదలగా ఉంది. సాక్షి క్రీడా విభాగం ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు తాజా ఫామ్ ఏ ప్రత్యర్థికైనా దడ పుట్టించేలా ఉంది. దక్షిణాఫ్రికాలాంటి బలమైన ప్రత్యర్థితో బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆ జట్టు సాధించిన అలవోక విజయం దానిని మళ్లీ నిరూపించింది. ఆల్‌రౌండ్ నైపుణ్యం గల ఆటగాళ్లతో పాటు సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండటం ఆ జట్టుకు అదనంగా అనుకూలించే అంశం. ముఖ్యంగా మోర్గాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాక వన్డే టీమ్‌లో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. ఏకంగా తొమ్మిదో స్థానం వరకు ఎలాంటి తత్తరపాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగల లైనప్ ఇంగ్లండ్ సొంతం. తమకు అనుకూలించే వాతావరణ పరిస్థితుల్లో స్వింగ్‌తో చెలరేగిపోగల బౌలర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. ఇవన్నీ ఇతర జట్లకంటే ఆతిథ్య జట్టును అందరికంటే ముందు నిలబెడుతున్నాయి. గత రికార్డు... చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ రెండు సార్లు ఫైనల్ చేరింది. 2004లో వెస్టిండీస్ చేతిలో ఆ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. 217 పరుగులు చేసిన ఇంగ్లండ్.. విండీస్‌ను 147/8 వద్ద కట్టడి చేసి విజయాన్ని ఆశించింది. కానీ విండీస్ బ్యాట్స్‌మెన్ బ్రౌన్, బ్రాడ్షా 71 పరుగులు జోడించి ఇంగ్లండ్ కథ ముగించారు. గత టోర్నీలో భారత్ చేతిలోనే ఇంగ్లండ్‌కు ఓటమి ఎదురైంది. ఈ 20 ఓవర్ల మ్యాచ్‌లో కూడా ఆ జట్టు విజయానికి చేరువగా వచ్చింది. చేతిలో ఆరు వికెట్లతో 16 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి ఇంగ్లండ్ ఓటమి దిశగా నడిచింది. ఓవరాల్‌గా చాంపియన్స్ ట్రోఫీలో 21 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ టీమ్ 11 గెలిచి, 10 మ్యాచ్‌లలో ఓడింది. అంతా స్టార్లే... ఓపెనర్లు జేసన్ రాయ్, హేల్స్ జోడి ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరద పారిస్తోంది. ప్రతీసారి వీరు అందిస్తున్న శుభారంభమే ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేస్తోంది. నిలకడకు మారు పేరైన జో రూట్‌తో పాటు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్‌లతో జట్టు మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా స్టోక్స్ ఆల్‌రౌండ్ నైపుణ్యం ఇంగ్లండ్ జట్టుకు వరంలా మారింది. ప్రపంచంలోనే ఇప్పుడు మేటి ఆల్‌రౌండర్‌గా ఉన్న స్టోక్స్, ఇటీవల ఐపీఎల్లో ప్రదర్శించిన ఫామ్‌ను కొనసాగిస్తే ఇతర జట్లకు కష్టాలు తప్పవు. మోకాలి గాయం నుంచి కోలుకొని అతను పూర్తి ఫిట్‌గా మారడం ఆ జట్టు ఆందోళనను దూరం చేసింది. మొయిన్ అలీ కూడా ఆల్‌రౌండర్‌గా చెలరేగిపోతున్నాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై వోక్స్, వుడ్, ప్లంకెట్లాంటి పేసర్లు సరిగ్గా సరిపోతారు. అంతా అనుకూలం... లీగ్ దశలో జూన్ 1న జరిగే టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్‌కు మంచి విజయావకాశాలు ఉన్నాయి. చివరి మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడాల్సి ఉన్నా... ఇంగ్లండ్ గడ్డపై ఇటీవల ఆస్ట్రేలియాకు రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు కాబట్టి మోర్గాన్ సేన సెమీస్ అడుగు ఖాయంగా వేసినట్లే. ఇంగ్లండ్ జట్టు వివరాలు: మోర్గాన్ (కెప్టెన్), బెయిర్‌స్టో, బిల్లింగ్స్, హేల్స్, రషీద్, జేసన్ రాయ్, విల్లీ, మార్క్ వుడ్, మొయిన్ అలీ, జేక్ బాల్, బట్లర్ (వికెట్ కీపర్), ప్లంకెట్, రూట్, స్టోక్స్, వోక్స్. ఇంగ్లండ్ జట్టు మంచి సమతూకంతో ఉంది. 9–10 స్థానాల వరకు బ్యాటింగ్ చేయగలవారు ఆ జట్టులో ఉన్నారు. కనీసం ఐదుగురు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయగల సమర్థులు. వారిపై గెలవడం అంత సులువు కాదని మాకు భారత్‌లోనే అర్థమైంది. ఇంగ్లండ్‌ను ఓడించడం ప్రతీ జట్టుకు సవాలే. గత రెండేళ్లలో వారి క్రికెట్ చాలా మారిపోయింది. కొడితే కనీసం 330 పరుగులు కొడుతున్నారు. జట్టుగా మెరుగు కావడంలో వారి పట్టుదలను అభినందించక తప్పదు. ఏ దశలోనూ ఓటమిని అంగీకరించని విధంగామానసికంగా కూడా జట్టు చాలా ఎదిగింది. దూకుడైన ఆటతో ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక సొంతగడ్డపై వారిని ఎదుర్కోవడం చాలా కష్టం. – ఇంగ్లండ్ జట్టు గురించి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య -
వన్డే కెప్టెన్ గా సరికొత్త రికార్డు..
ఆంటిగ్వా: ఇంగ్లండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సరికొత్త రికార్డు సాధించాడు. శుక్రవారం వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో మోర్గాన్ సెంచరీ సాధించి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో మోర్గాన్ సెంచరీ నమోదు చేయడం ద్వారా అతని పేరిట కొత్త రికార్డు లిఖించబడింది. ఇంగ్లండ్ తరపున వన్డే కెప్టెన్ గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సాధించాడు. ఇది కెప్టెన్ గా మోర్గాన్ కు ఐదో సెంచరీ. తద్వారా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు ఆండ్రూ స్ట్టాస్, అలెస్టర్ కుక్‌లు రికార్డును మోర్గాన్ అధిగమించాడు. అంతకుముందు స్ట్రాస్, కుక్‌లు కెప్టెన్‌గా నాలుగు సెంచరీలు మాత్రమే సాధించగా, దాన్ని మోర్గాన్ సవరించాడు. వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. మోర్గాన్(107) సెంచరీకి తోడు బిల్లింగ్స్(52), బెన్ స్టోక్స్(55)లు రాణించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ఆ తరువాత విండీస్ 47.2 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. జాసన్ మొహ్మద్(72),కార్టర్(52)లు మాత్రమే హాఫ్ సెంచరీలు సాధించడంతో విండీస్ కు పరాజయం తప్పలేదు. -
మ్యాచ్ రిఫరీకి ఇంగ్లండ్ ఫిర్యాదు!
నాగ్‌పూర్:భారత్ తో జరిగిన రెండో ట్వంటీ 20లో తమ ఓటమికి అంపైరింగే ప్రధాన కారణమని భావిస్తున్న ఇంగ్లండ్..మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమైంది. ప్రధానంగా చివరి ఓవర్లో జో రూట్‌ను ఎల్బీడబ్యూగా ప్రకటించిన అంపైర్ షంషుద్దీన్పై ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు జో రూట్ అవుట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మెర్గాన్.. అంపైరింగ్ నాణ్యతకు సంబంధించిన ఫీడ్ బ్యాక్‌తో రిఫరీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. 'విజయం మా చేతుల్లోకి వచ్చి చేజారింది. క్లిష్ట సమయంలో జో రూట్ వివాదాస్పదంగా అవుట్ కావడం మా ఓటమికి కారణమైంది. దీనిపై రిఫరీకి ఫిర్యాదు చేయనున్నాం. ట్వంటీ 20ల్లో డీఆర్ఎస్ ఎందుకు లేదో అర్థం కావడం లేదు'అని మోర్గాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. తమ ఇన్నింగ్స్ 20.0 ఓవర్ లో జో రూట్ అవుట్ కావడమే మ్యాచ్ ను మలుపు తిప్పిందన్నాడు. ఒకవేళ జో రూట్ అవుట్ ను తాము సవాల్ చేసే అవకాశం ఉంటే కచ్చితంగా మ్యాచ్ ను గెలిచేవాళ్లమని ధీమా వ్యక్తం చేశాడు. రెండో ట్వంటీ 20లో చివరి ఓవర్ లో జోరూట్‌ను బూమ్రా తన తొలి బంతికే ఎల్బీగా అవుట్ చేశాడు. అయితే ఆ బంతి జో రూట్ బ్యాట్‌కు తగిలిన తరువాతే అతని ప్యాడ్లకు తాకినట్లు రీప్లేలో స్పష్టమైంది. కొన్ని సందర్బాల్లో ఇలా జరగడం సర్వసాధారణమే అయినప్పటికీ, అదే తాము మ్యాచ్ ను కోల్పోవడానికి కారణమైందంటూ ఇంగ్లండ్ వాపోతుంది. ఫలితాన్ని తారుమారు చేసిన నిర్ణయం కావడంతో ఇంగ్లండ్ సిరీయస్ గా ఉంది. దీనిపై ఇంగ్లండ్ యాజమాన్యంతో పాటు, ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మ్యాచ్ ను ఇంగ్లండ్ గెలిచి ఉంటే ఈ అంశం పెద్దగా చర్చకు వచ్చేది కాదు. ఓటమిని జీర్ణించుకోలేని ఇంగ్లండ్.. అదే అవుట్ ను ప్రత్యేకంగా ఎత్తిచూపుతూ రిఫరీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమైంది. ఈ ఫిర్యాదుతో తాము ఓడిపోలేదు..అంపైరింగ్ మాత్రమే ఓడించింది అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి సానుభూతి పొందాలనే ఇంగ్లండ్ భావనగా కనబడుతోంది. -
ఆఖరి ఓవర్లో గెలిపించిన ’బుమ్రా’
-
భళా... బుమ్రా
ఆఖరి ఓవర్లో గెలిపించిన పేసర్ ఇంగ్లండ్‌పై రెండో టి20లో భారత్ గెలుపు రాణించిన రాహుల్, నెహ్రా సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత పోరాటాన్ని ప్రదర్శించింది. రాహుల్ మినహా బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట.. బౌలర్లు మాత్రం స్ఫూర్తిదాయక ప్రదర్శనతో జట్టుకు కీలక విజయాన్ని అందించారు. ప్రారంభంలో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన నెహ్రా ఇంగ్లండ్ పతనానికి బాట వేయగా... ఆఖరి ఓవర్లో బుమ్రా రెండు వికెట్లు తీసి సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. నాగ్‌పూర్: చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి కావాల్సిన పరుగులు 8... క్రీజులో ఉన్నది స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్‌తో పాటు బౌండరీలతో జోరు మీదున్న బట్లర్. భారత అభిమాని ఆశలు అడుగంటిన ఈ పరిస్థితిలో మీడియం పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమే చేశాడు. నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్‌కు పంపించడంతోపాటు కేవలం రెండు పరుగులే ఇవ్వడంతో భారత జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా (3/28) కూడా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ 1–1తో సమం చేసింది. మూడో టి20 ఫిబ్రవరి 1న బెంగళూరులో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 71; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మనీష్ పాండే (26 బంతుల్లో 30; 1 సిక్స్), కోహ్లి (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 139 పరుగులు చేసి ఓడిపోయింది. రాహుల్ ఒక్కడే: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. తొలి మూడు ఓవర్లలో ఐదు పరుగులే రాగా... నాలుగో ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్‌తో 15 పరుగులు రాబట్టి టచ్‌లోకి వచ్చాడు. అయితే మరుసటి ఓవర్లో జోర్డాన్ వేసిన స్లో బంతిని లాంగ్ ఆన్‌లో భారీ షాట్ ఆడి క్యాచ్ అవుటయ్యాడు. కొద్దిసేపటికే రైనా (7), యువరాజ్ (4) కూడా అవుట్ కావడంతో భారత్ 69 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మనీష్ పాండేతో కలిసి ఓపెనర్ రాహుల్ తన జోరును కొనసాగిస్తూ రన్‌రేట్ పెంచే ప్రయత్నం చేశాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు 36 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశారు. నెహ్రా ఝలక్: స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు నాలుగో ఓవర్లోనే పేసర్ ఆశిష్ నెహ్రా గట్టి ఝలక్ ఇచ్చాడు. అంతకుముందు ఓవర్లో ఓపెనర్లు బిల్లింగ్స్ (12), రాయ్ (10) చెరో సిక్స్ బాదినా నెహ్రా వీరిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో రూట్, మోర్గాన్ (17; 1 ఫోర్) పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. మిశ్రా వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో రూట్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అయితే తన తర్వాతి ఓవర్ తొలి బంతికే మోర్గాన్ వికెట్ తీసి ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత స్టోక్స్ రెచ్చిపోయి రైనా ఓవర్లో వరుసగా 4, 6.. చాహల్ బౌలింగ్‌లో మరో సిక్స్‌తో బ్యాట్‌ను ఝళిపించాడు. నెహ్రా 17వ ఓవర్లో స్టోక్స్‌ను ఎల్బీగా అవుట్ చేయగా... 18వ ఓవర్లో బుమ్రా కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టడంతో పాటు చివరి ఓవర్లో మాయే చేసి అనూహ్య ఫలితాన్ని అందించాడు. -
తలవంచారు...
బ్యాటింగ్‌లో మెరుపులు లేవు, మొదటి బంతినుంచే వినోదాన్ని పంచే ధనాధన్ షాట్లు అసలే లేవు... రిపబ్లిక్ డే నాడు పరుగుల మోతతో పండగ చేసుకుందామనుకున్న భారత అభిమానులను పూర్తిగా నిరాశ పరిచే ఫలితం... అతి సాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన భారత్‌కు టి20 తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో భంగపాటు... టెస్టు, వన్డే సిరీస్ విజయాల జోరులో ఉన్న కెప్టెన్ కోహ్లికి నాయకత్వం వహించిన తొలి మ్యాచ్‌లోనే పరాజయం... కోహ్లి ఓపెనింగ్ చేసినా ఆరంభం అంతంత మాత్రమే... మూడు ఓవర్ల వ్యవధిలో ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు... ఒక దశలో వరుసగా ఏడు ఓవర్లలో కలిపి వచ్చిన పరుగులు 37 మాత్రమే... రైనా పర్వాలేదనిపించినా, ధోని చివర్లో కొన్ని పరుగులు జోడించినా అదీ అల్ప సంతోషమే... భారత బ్యాట్స్‌మెన్ స్థాయికి తగిన ప్రదర్శన ఎక్కడా కనిపించకపోగా, ఇంగ్లండ్ బౌలర్ల క్రమశిక్షణ ఇన్నింగ్స్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తమ ఆటతో మరింత చిన్నదిగా మార్చేశారు. ఏమాత్రం తడబాటు లేకుండా అలవోకగా మన బౌలింగ్‌ను ఎదుర్కొన్న ప్రత్యర్థి సిరీస్‌లో ముందంజ వేసింది. కెప్టెన్ మోర్గాన్ సిక్సర్ల మోతకు తోడు రూట్ సాధికారిక బ్యాటింగ్ కలిసి ఇంగ్లండ్‌కు 11 బంతుల ముందే విజయాన్ని అందించింది. కాన్పూర్: భారత్‌తో టి20 సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. మొదటి మ్యాచ్‌లో విజయంతో ఆ జట్టు సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. గురువారం ఇక్కడి గ్రీన్‌పార్క్ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ధోని (27 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు), సురేశ్ రైనా (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మొయిన్ అలీ 2 కీలక వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్ (38 బంతుల్లో 51; 1 ఫోర్, 4 సిక్సర్లు), జో రూట్ (46 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు) చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 69 బంతుల్లో 83 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఆదివారం నాగపూర్‌లో జరుగుతుంది. ఆదుకున్న రైనా, ధోని... భారత్ ఇన్నింగ్స్ చెప్పుకోదగ్గ మెరుపులు లేకుండా ఆసాంతం సాదాసీదాగా సాగింది. ఒక ఓవర్లో అత్యధికంగా 12 పరుగులే (20వ ఓవర్) భారత్ రాబట్టగలిగింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కోహ్లి (26 బంతుల్లో 29; 4 ఫోర్లు) ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా, రెండో ఎండ్‌లో రాహుల్ (8) విఫలమయ్యాడు. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న రైనా, వరుస ఫోర్లతో దూకుడు ప్రదర్శించాడు. పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 47 పరుగులకు చేరింది. అయితే అలీ తన తొలి ఓవర్లోనే కోహ్లిని పెవిలియన్ పంపించి భారత్‌ను దెబ్బ తీయగా, షార్ట్ బాల్‌ను ఆడలేక యువరాజ్ (12) వెనుదిరిగాడు. మరో వైపు స్టోక్స్ బౌలింగ్‌లో ఈ ఇన్నింగ్స్‌లో ఏకైక సిక్సర్ బాదిన రైనా, తర్వాతి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాండే (3), పాండ్యా (9) కూడా విఫలం కావడంతో భారీ స్కోరు అందించాల్సిన బాధ్యత ధోనిపై పడింది. అయితే సింగిల్స్‌పైనే ఎక్కువగా (14) ఆధారపడిన ధోని, చివరి ఓవర్లో మాత్రం వరుసగా రెండు ఫోర్లు కొట్టి స్కోరును 147 పరుగులకు చేర్చాడు. ఈ మ్యాచ్‌తో రసూల్ భారత్ తరఫున టి20ల్లో అరంగేట్రం చేశాడు. మోర్గాన్ సిక్సర్ల వర్షం... స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు రాయ్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), బిల్లింగ్స్ (10 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) ఘనమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్లో నెహ్రా 4 పరుగులే ఇచ్చినా... బుమ్రా వేసిన రెండో ఓవర్లో బిల్లింగ్స్ 3 ఫోర్లు, సిక్సర్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. అయితే తొలి 3 ఓవర్లలో 36 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. తర్వాతి ఐదు ఓవర్లలో 26 పరుగులే ఇచ్చారు. చహల్ తన తొలి ఓవర్లోనే రాయ్, బిల్లింగ్స్లను బౌల్డ్ చేయడం విశేషం. అయితే ఈ తర్వాత ఇంగ్లండ్ మరో అవకాశం ఇవ్వకుండా ఆడింది. మోర్గాన్ తనదైన శైలిలో సిక్సర్లతో చెలరేగగా, రూట్ అతనికి అండగా నిలిచాడు. రసూల్ ఓవర్లో భారీ సిక్సర్‌తో 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మోర్గాన్, అదే ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో బౌల్డయినా, అది నోబాల్ కావడంతో బతికిపోయిన రూట్... స్టోక్స్ ( నాటౌట్)తో కలిసి మిగతా పని పూర్తి చేశాడు. -
మళ్లీ కెప్టెన్‌గా మోర్గాన్
ముంబై: ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు నుంచి తప్పుకున్న ఇయాన్ మోర్గాన్ తిరిగి జట్టులో జాయిన్ కానున్నాడు. భారత్‌తో జరుగనున్న మూడు వన్డేల సిరీస్‌కు మోర్గాన్ ను తిరిగి జట్టులో ఎంపిక చేశారు. దాంతోపాటు ఇంగ్లండ్ వన్డే జట్టు, టీ 20 కెప్టెన్‌గా మోర్గాన్ పేరును ఖరారు చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్‌లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన మోర్గాన్ ఆ పర్యటనకు దూరంగా ఉన్నాడు. దాంతో ఇంగ్లండ్ వన్డే కెప్టెన్సీ బాధ్యతలను జాస్ బట్లర్‌కు అప్పగించాల్సి వచ్చింది. ప్రస్తుతం మోర్గాన్ జట్టుకు అందుబాటులోకి రావడంతో అతనే వన్డే,టీ 20 కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. బట్లర్‌తో పాటు అలెక్స్ హేల్స్‌లు వన్డే, టీ 20 జట్టులో కలవనున్నారు. మరొకవైపు బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే జట్టు నుంచి విశ్రాంతినిచ్చిన జో రూట్ ను భారత్ తో వన్డే సిరీస్ కు ఎంపిక చేశారు.ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ టెస్టు జట్టులో రూట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ వన్డే జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్ స్టో, జాక్ బాల్, సామ్ బిల్లింగ్స్, జాస్ బట్లర్, డావసన్, హేల్స్, ప్లంకెట్, అదిల్ రషిద్, జో రూట్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్